అక్రమ సంబంధాల కారణాలు ఏంటో …
లహరి,ఫిబ్రవరి 1, ఆరోగ్యం : ఏ బంధమైనా సరే.. నమ్మకంతో ముడిపడి ఉంటుంది. ఆ నమ్మకమే కోల్పోతే.. ఇక ఆ బంధం నరకప్రాయమే. ఈ నేపథ్యంలోన చాలా మంది జంటలు తమ పార్టనర్స్‌ని మోసం చేస్తున్నారు. ఇవి ఏదో ఓ సమయంలో బయటికి రావడంతో ఇద్దరి మధ్య గొడవలు, కొట్లాటలు చివరికి ఇది విడాకుల దాక వెళ్తుంది. అందుకే అక్రమ సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. అసలు ఈ పరిస్థితి ఎందుకొస్తుందో, ఏ కారణాల వల్ల అక్రమ సంబంధాలు పెట్టుకుంటారో ఇప్పుడు చూద్దాం.
కోరికలు తీరకపోతే..సాధారణంగా పెళ్ళి చేసుకున్న జంటలు శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారు. కొంత మంది అనేక కారణాలతో ఆ కార్యాన్ని ఆస్వాదించలేకపోతారు. పార్టనర్ కావాలనుకున్నా.. వారికనుగుణంగా ఉండలేరు. దీంతో ఆ కోరికలు తీరక వాటిని తీర్చుకునేందుకు వేరే వారితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటారు..
ఒంటరితనం..
ఇంతకుముందు అంటే ఇంట్లో బంధువులు ఉండేవారు. అత్త, మామ, తోడికోడళ్ళు, ఇలా చాలా మంది ఉండేవారు. వీరితో సమయం గడపడం, విషయాలు షేర్ చేసుకోవడం ఇలా ఉండి వేరే ధ్యాసే వచ్చేది కాదు. కానీ, నేడు చాలా మంది జంటలు ఒంటరిగానే ఉంటున్నారు. దీంతో ఒకరు జాబ్‌కి వెళ్ళిపోవడం, ఒంటరిగా ఉండడం, ఒకరు బిజీగా ఉంటే ఒకరు ఖాళీగా ఉండడంతో ఆ సమయాన్ని ఎలా గడపాలో తెలియక, తమ ఫీలింగ్స్‌ని ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక ఇతరులవైపు చూస్తున్నారు..
ప్రేమ లేకపోవడం..
సాధారణంగా చాలా మంది పెళ్ళి చేసుకుంటారు. అందులో కొన్ని పెళ్ళిళ్లు కాంప్రమైజ్ అయి చేసుకుంటారు. అది వారి కుటుంబం కోసమో, అవసరం కోసమో మరో ఇతర కారణం కోసమో.. అలాంటప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ ఉండదు. వేరేవారికి అట్రాక్ట్ అవుతారు. దీంతో ఆ సంబంధం అక్రమ సంబంధానికి దారి తీస్తుంది.
Also Read : ముట్టుకోవడం వల్ల కుష్టు వ్యాధి వస్తుందా..
ఏం చేయాలంటే..
ఏదేమైనా ఓ రిలేషన్‌లోకి అడుగుపెట్టాక.. దానికంటూ విలువనివ్వాలి. ఏమైనా తేడాలు వస్తే కూర్చుని మాట్లాడాలి. మనిషిలో మార్పు రాకపోతే కౌన్సెలింగ్ ఇప్పించాలి. అన్ని జరిగాక కూడా సమస్య సాల్వ్ కాకపోతే ఇద్దరి అంగీకారంతో విడిపోవాలి. అంతేకానీ, రిలేషన్‌లో ఉండి పార్టనర్‌ని మోసం చేయడం అస్సలు సరికాదని గుర్తుంచుకోండి.