ఆదివాసీలు అక్రమార్కులు కాదు : జడ్పీటీసీ పుష్పలత

పోడు భూములు లాక్కుంటే పోరుబాట పడతాం : ఎంపీపీ సతీష్ కుమార్

1
TMedia (Telugu News) :

ఆదివాసీలు అక్రమార్కులు కాదు : జడ్పీటీసీ పుష్పలత

 

పోడు భూములు లాక్కుంటే పోరుబాట పడతాం : ఎంపీపీ సతీష్ కుమార్

 

పోడు సర్వే నిలిపివేస్తే ఊరుకునేది లేదు : ఎంపిపి శారద

 

టి మీడియా, అక్టోబర్ 25, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం ఆదివాసీలు జల్,జంగిల్, జమీన్ నినాదంతో పోరాటం చేసి, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు అటవీ శాఖ అధికారులు కుట్ర చేయడం శోచనీయం. నూగూరు ఫారెస్ట్ బీట్ పరిధిలో ఒంటిమామిడి, బొల్లారం, మహితాపురం ఆదివాసీ పోడు రైతుల సాగును అటవీశాఖ అధికారులు తరుచూ అడ్డుకోవడంతో వాజేడు, వెంకటాపురం మండలాల ప్రజా ప్రతినిధులు అయిన జడ్పీటీసీ పుష్పలత,వెంకటాపురం మండల ఎంపీపీ సతీష్ కుమార్, వాజేడు ఎంపీపీ శారద మంగళవారం మూడు గ్రామాల పోడు భూములను ఉమ్మడిగా క్షేత్ర పరిశీలన చేయడం జరిగింది. రెండు మండలాల కు చెందిన మూడు గ్రామాల ఆదివాసీ పోడు రైతులతో వారు మాట్లాడటం జరిగింది.

 

Also Read : చేనేత కార్మికుల పై జిఎస్టీ ఎత్తి వేయాలి

 

ఈ సందర్భంగా వాజేడు జడ్పిటిసి తల్లడి పుష్పలత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కు పోడు హక్కు పత్రాలు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో పోడు భూముల సర్వే చేపట్టిందని అన్నారు. ఆదివాసీలు సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వాజేడు ఎంపీపీ శారద అన్నారు. అటవీ శాఖ అధికారులు పోడు సాగుదరులను ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దని కోరడం జరిగింది. ,ప్రభుత్వం ఆదివాసీల పట్ల చిత్తశుద్ధితో ఉందన్నారు. అటవీ శాఖ అధికారులు ఆదివాసీల పట్ల సంయమనం పాటించాలన్నారు. బేస్ క్యాంపులు పెట్టి ఆదివాసీల ను దొంగలుగా చిత్రీకరించొద్దని వ్యాఖ్యానించారు. ఆదివాసీ పోడు రైతు కంతి విజయ్ మాట్లాడుతూ ఆదివాసీలకు అడవికి అవినాభావ సంబంధం ఉందన్నారు. . మా భూముల ను లాక్కోవలని చూస్తే అధికారుల పైన ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బర్లగూడెం సర్పంచి కొర్శా నర్సింహమూర్తి, ఏ.ఎన్.ఎస్.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు, మహితపురం, ఒంటిమామిడి, బొల్లారం ఎఫ్.ఆర్.సి.కమిటీలు, పెసా కమిటీలు ,సుమారు 300 మంది ఆదివాసీలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube