నేటి(28) నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.

- 5 గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు

0
TMedia (Telugu News) :

నేటి(28) నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.

– 5 గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు

టీ మీడియా, డిసెంబర్ 27, హైద‌రాబాద్ : ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు నమూనాలను సిద్ధం చేసింది. మహాలక్ష్మీ పథకంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. మిగతా గ్యారంటీల అమలు ప్రక్రియ కోసం దరఖాస్తులను స్వీకరించనుంది.

మహాలక్ష్మీ పథకం: ఒక్క దరఖాస్తులోనే ఆరు గ్యారంటీలకు సంబంధించిన కాలమ్‌లు ఉండేలా ప్లాన్ చేసింది. అందరికీ సులభంగా అర్థమయ్యేలా ఈ దరఖాస్తును రూపొందించారు. మహాలక్ష్మీ పథకంలో ప్రతి నెల రూ. 2500 ఆర్థిక సహాయం అనే కాలమ్ ఉంది. ఈ పథకం కావాలనుకునే వారు.. పక్కన ఉన్న బాక్స్‌లో టిక్ చేస్తే సరిపోతుంది. ఇక అందులోనూ రూ. 500లకు గ్యాస్ సిలిండర్ ఆప్షన్ ఉంది. ఈ పథకం పొందాలనుకునే వాళ్లు ఇక్కడి టిక్ చేయడంతోపాటు గ్యాస్ కనెక్షన్ నంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది.

Also Read : గ్యాస్ సిలిండ‌ర్‌లో అమ‌ర్చిన ఐఈడీ

రైతు భరోసా: ఇక రైతు భరోసా పథకం పొందాలనుకునే వాళ్లు ఇందులో పలు కాలమ్‌లను టిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో రైతు, కౌలు రైతు, పట్టాదారు పాసు పుస్తకం నంబర్లు, సాగు చేస్తున్న భూమి వివరాలు నమోదు చేయాలి. ఇక ఏటా రూ. 12000 కావాలనుకునే వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కార్డు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇందిరమ్మ ఇళ్లు: ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం కావాలనుకునే వారు కూడా ఈ దరఖాస్తులోనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో అమరవీరులు, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలానికి సంబంధించిన కాలమ్ కూడా ఉంది. అయితే అమరవీరులు, ఉద్యమకారులకు సంబంధించిన వివరాలు ఇందులో నమోదు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివరాలు కూడా ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది.
గృహజ్యోతి: గృహజ్యోతి పథకం కింది నెలకు ఉచిత విద్యుత్ కావాలనుకునే వాళ్లు ఇందులో ఉన్న కాలమ్‌లో వివరాలు నమోదు చేయాలి. వారి గృహ వినియోగ విద్యుత్ మీటర్‌ కనెక్షన్ సంఖ్యను తెలిపాల్సి ఉంటుంది.
చేయూత: చేయూత పథకం కింద నెలకు రూ. 4000 కావాలనుకునే వారు రూ. 6000 పొందాలనుకునే దివ్యాంగులు కూడా చేయూత పథకం కింద ఉండే కాలమ్‌లలో వివరాలు నమోదు చేయాలి. ఇందులో అనేక ఆప్షన్లు ఇచ్చారు. లబ్దిదారులు ఏ కోటాలో చేయూత పథకం పొందాలనే అంశాన్ని తెలియజేయాలి. ఇప్పటికే ఫించన్ తీసుకుంటున్న వాళ్లు దీనికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

Also Read : ‘భారత్‌ న్యాయ్ యాత్ర ‘ చేపట్టనున్న రాహుల్‌ గాంధీ

ఏయే పత్రాలు కావాలి? ఇక ఈ దరఖాస్తులో వివరాలు పొందుపర్చిన వారంతా దీనికి ఆధార్ కార్డ్ జిరాక్స్‌తో పాటు తెల్లరేషన్‌ కార్డ్ ప్రతిని జతచేయాలి.
రశీదు: ఈ దరఖాస్తును తీసుకునే అధికారులు.. ఇందుకు సంబంధించిన రశీదును కూడా అందిస్తారు.
మంత్రి పొంగులేటి ఏమన్నారంటే.. ఈ ఆరు గ్యారంటీల స్కీమ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 28నుంచి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పిన ఆయన.. అన్ని గ్రామాల్లో అవసరమైన అప్లికేషన్లను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు రేషన్ కార్డును అర్హతను ప్రామాణికంగా నిర్దేశించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube