కేసీఆర్‌ ఆశీస్సులు తీసుకున్న రెడ్ కో చైర్మన్‌ స‌తీశ్ రెడ్డి

కేసీఆర్‌ ఆశీస్సులు తీసుకున్న రెడ్ కో చైర్మన్‌ స‌తీశ్ రెడ్డి

0
TMedia (Telugu News) :

కేసీఆర్‌ ఆశీస్సులు తీసుకున్న రెడ్ కో చైర్మన్‌ స‌తీశ్ రెడ్డి
టీ మీడియా, జూన్ 22, హైద‌రాబాద్‌ :తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (తెలంగాణ స్టేట్ రినెవెబుల్ ఎన‌ర్జీ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్‌) చైర్మన్‌గా నియ‌మితులైన యెరువు స‌తీశ్ రెడ్డి ప్రగతి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను మ‌ర్యాద పూర్వకంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సీఎం ఆశిస్సుల‌ను తీసుకున్నారు. త‌న‌ మీద నమ్మకంతో ప‌ద‌వి అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.సీఎం ఇచ్చిన బాద్యతలను త్రిక‌ర‌ణ శుద్ధితో నిర్వహిస్తానని సతీశ్‌ రెడ్డి తెలిలిపారు.

Also Read : ‘మీ అహంకారం 4 రోజులే

అనంత‌రం ఆయన, ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శన్‌ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేష‌న్ చైర్మన్‌ వాసుదేవ రెడ్డిల‌తో క‌లిసి పంచాయ‌తీరాజ్ శాఖ‌ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావుని మంత్రుల నివాసంలో క‌లిశారు. త‌న‌కు ఈ ప‌ద‌వి రావ‌డానికి స‌హ‌క‌రించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి స‌తీశ్ రెడ్డిని శాలువాతో సత్కరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube