శరీర బరువును, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోండి..
లహరి, ఫిబ్రవరి 14, ఆరోగ్యం : నిద్రలేవగానే టీ తాగడానికి ఇష్టపడతారు. అయితే ఈ సాంప్రదాయం భారత దేశలంలోనే కాకుండా ఇతర దేశాల ప్రజలు కూడా ఇలానే చేస్తారు. ఉదయం టీ తాగకపోతే రోజంతా అసంపూర్ణంగా ఉంటుంది. అయితే అతిగా టీలు తాగడం కారణంగా చాలా మంది శరీర బరువు పెరుగుతున్నారు. ఈ బరువును తగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ శరీర బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం టీని తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
టీలకు బదులుగా వీటిని తాగండి:
1. బ్లాక్ కాఫీ:
ప్రస్తుతం చాలా మంది టీ తాగడానికి అలవాటు పడ్డారు. అయితే టీకి బదులుగా ప్రతి రోజూ టీలను తాగడం శరీరానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాఫీలో కెఫిన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను పెంచి బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Also Read : శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి ధర్మకర్తల మండలి నియామకం
2. కొబ్బరి నీళ్లు:
కొబ్బరి నీళ్లలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని తాగడం వల్ల శరీరంలో కేలరీల పరిమాణాలు తగ్గిపోయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారు.
3. ఆపిల్ సైడర్ వెనిగర్:
యాపిల్ సైడర్ వెనిగర్ కూడా శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే గుణాలు జీవక్రియ శక్తిని పెంచి పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మధుమేహంతో బాధపడుతున్నవారికి కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది.
4. గ్రీన్ టీ:
గ్రీన్ టీ ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి యాంటీఆక్సిడెంట్స్ లభించి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ రెండు సార్లు గ్రీన్ టీని తాగాల్సి ఉంటుంది.
5. నిమ్మరసం:
నిమ్మరసాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గుతాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజూ నిమ్మ రసం తాగాల్సి ఉంటుంది.