టీ మీడియా,డిసెంబర్ 2,కరకగూడెం:
కరకగూడెం మండలంలోని రేగళ్ల గ్రామానికి చెందిన బాడిశ దశరథం ఇటీవలే తాటిచెట్టు మీద నుండి ప్రమాదవశాత్తు కింద పడడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి చికిత్స పొందుతూ మృతి చెందినాడు.విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దశదినకర్మలకు బాధిత కుటుంబానికి రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ నుండి 10000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు కుంజ వసంత రావు,ఉప సర్పంచు బాడిశ లక్ష్మీనారాయణ,మాజీ సర్పంచు కొమరం శ్రీను,కొమరం రాంబాబు,రేగా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.