ఇరుముడి కార్యక్రమంలోపాల్గొన్న విప్ శ్రీ రేగా
లహరి ,నవంబరు 24,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని గుట్ట మల్లారం శ్రీ శ్రీ శ్రీ పంచముఖ వేద గాయత్రి దేవస్థానం నందు జరిగిన అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు, గురువారం నాడు ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని, అయ్యప్ప స్వాములకు పూలమాలవేసి శుభాకాంక్షలు తెలియజేశారు, అయ్యప్ప స్వాములు శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకొని క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని కోరారు.