అనధికార లేఅవుట్ల ప్లాట్లు రిజిస్టేషన్లు

నేడు,రేపుఉత్తర్వులు కుఅవకాశం

1
TMedia (Telugu News) :

అనధికార లేఅవుట్ల ప్లాట్లు రిజిస్టేషన్లు

– నేడు,రేపుఉత్తర్వులు కుఅవకాశం

– ఆదాయం లక్ష్యం గా ప్రభుత్వ నిర్ణయం

టీ మీడియా,సెప్టెంబర్ 21,హైదరాబాద్‌: అనుమతులు లేని లేఅవుట్లలోని ప్లాట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అలాంటి లేఅవుట్లలోని ప్లాట్లకు ఫస్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు. దీనితో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల శివార్లలోని గ్రామ పంచాయతీల్లో వేలాది ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ గ్రామాల్లో చాలా వరకు మున్సిపాలిటీలుగా మారడమో, విలీ­నం కావడమో జరిగింది. ఈ నేపథ్యంలో నిబంధనను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సదరు లేఅవుట్లు ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించేందుకు అర్హమైనవి అయితే.. ఆ లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను అనుమతించనున్నట్టు తెలిసింది.

Also Read : సింగరేణిలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

ప్రస్తుతానికి ఆ ప్లాట్లకు ఫస్ట్‌ రిజిస్ట్రేషన్లు చేయాలని.. అయితే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించాల్సి ఉందన్న అంశాన్ని చేర్చా­లని భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఒకటి రెండు రోజుల్లో జారీచేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదనపు ఆదాయ వనరుల సమీకరణలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube