రిజిస్ట్రేషన్ ఆఫీస్ తక్షణమే మార్చాలి

రిజిస్ట్రేషన్ ఆఫీస్ తక్షణమే మార్చాలి

2
TMedia (Telugu News) :

రిజిస్ట్రేషన్ ఆఫీస్ తక్షణమే మార్చాలి
టీ మీడియా, జూన్ 14,వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ తక్షణమే మార్చాలని అఖిల పక్ష ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించి ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం కలిగిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ వనపర్తి జిల్లా కేంద్రంలో సొంత భవనం లేక సినిమా టాకీస్ దగ్గర ఇరుకైన స్థలంలో పై అంతస్తులో నడుపుతుండడం వలన వికలాంగులు, వృద్ధులు, గర్భిణీలు వెళ్లలేని అలాంటి ఆఫీసును అక్కడి నుండి తొలగించాలని అఖిలపక్ష ఐక్య వేదిక, జిల్లా వికలాంగుల సంఘం ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందల పరిశీలించి అక్కడ వికలాంగుల పడుతున్న ఇబ్బందులను కలెక్టరు మరియు మంత్రి దృష్టికి తీసుకు వచ్చి పరిష్కరించే విధంగా పత్రిక ముఖంగా ఆందోళన చేయడం జరిగిందని. రిజిస్ట్రేషన్ ఆఫీసు లాంటి ప్రతి ఆఫీసులు పై అంతస్తులో ఉంటే దానికి లిఫ్ట్ సౌకర్యం మరియు వికలాంగులు వృద్ధులను తీసుకువెళ్లే ట్రై సైకిళ్లు వాటిని తీసుకెళ్ళి సౌకర్యం గల ర్యాంప్ ఏర్పాటు చేయాలి ఎలాంటి వసతులు లేకుండా ఒక అద్దె భవనంలో పై అంతస్తులో ఉండడం వికలాంగులు , వృద్ధులు , గర్భిణీలు వెళ్లాలంటే వారు వెళ్లలేనంతగా ఎత్తయిన మెట్లతో పై అంతస్తులో పెట్టడం వలన పలు ఇబ్బందులు పడుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదు.

 

Also Read : అందుబాటులో కి రాని పాఠ్యపుస్తకాలు

 

మిగితా వారు కూడా ఇరుకైనా స్థలం లో ఉండడం వలన చాలా ఇబ్బంది పాడున్నందున తక్షణమే అక్కడి నుండి విశాలమైన ప్రభుత్వ భవనానికి తరలించాలని అఖిలపక్ష ఐక్యవేదిక మరియు వికలాంగుల సంఘం డిమాండ్ చేస్తున్నది. మంగళవారం ఒక వికలాంగుడు బాండ్ పేపర్ కోసం వచ్చి మెట్లు ఎక్కలేని స్థితిలో ఉండి చాలాసేపు ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. అఖిలపక్ష ఐక్యవేదికను ఆశ్రయింస్తే వెంటనే స్పందించిన ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్, చిరంజీవి, వెంకటేష్, రమేశ్, రాజనగరం రాజేష్,భాస్కర్, లక్ష్మయ్య, షఫీ, వికలాంగుల సంఘ నాయకులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం జరిగింది.రిజిస్ట్రేషన్ ఆఫీసు 15 రోజుల్లోగా ప్రభుత్వ ఆఫీసులోని కింది అంతస్తులోకి మార్చుకుంటే ఆందోళన చేస్తామని, అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జరిగే అక్రమాలను, అవినీతిని సాక్షాదారాలతో బయట పెడతామని ఈ సందర్భంగా ఐక్య వేదిక మరియు వికలాంగుల సంఘం హెచ్చరించింది. ఈ సందర్బంగా రిజిస్టర్ గారికి అఖిల పక్ష ఐక్య వేదిక వినతి పత్రం అందజేయడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube