రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సొంత భవనం కేటాయించాలి

రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సొంత భవనం కేటాయించాలి

1
TMedia (Telugu News) :

రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సొంత భవనం కేటాయించాలి

టీ మీడియా, నవంబర్ 30, వనపర్తి బ్యూరో : రిజిస్ట్రేషన్ కార్యాలయమునకు తక్షణమే సొంత భవనం ఏర్పాటు చేయాలని అది కూడా జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఉన్న రాజ్ ఆఫీసులో ఏర్పాటు చేయాలని రియల్ ఎస్టేట్ దారులు, అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేశారు. బుధవారం కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అఖిలపక్ష ఐక్యవేదికను సంప్రదించి, రిజిస్ట్రేషన్ ఆఫీసును వనపర్తి పట్టణంలోనే ఏర్పాటు చేయాలని ఖాళీగా ఉన్న ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న పంచాయతీరాజ్ భవనంలోకి తీసుకురావాలని కోరడంతో అక్కడికి వెళ్లిన అఖిలపక్ష ఐక్యవేదిక.ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఇరుకుగా ఉన్న అద్దె భవనంలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసును సొంత భవనంలోకి తేవాలని గత కొంతకాలంగా మంత్రికి జిల్లా కలెక్టర్ కి విన్నవించుకోవడం జరిగిందని,కానీ ఇప్పుడు ఊరి బయట ఒక రియల్ ఎస్టేట్ వెనక వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నారని తెలిసి చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరూ కలిసి, ఐక్యవేదికను సంప్రదించడం జరిగింది.

Also Read : బిజేపికి రూ.614.53కోట్ల అత్య‌ధిక‌ విరాళాలు

అయితే ప్రజలందరికీ ఉపయోగపడే, ప్రభుత్వానికి ఆర్థిక ఆదాయం తీసుకువచ్చే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను వనపర్తి నడిబొడ్డులో ఉన్న ఖాళీగా ఉన్న పంచాయతీరాజ్ పాత ఆఫీసు దగ్గరనే భవనం నిర్మించాలని ,ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ కి ప్రజలు ఆఖిలపక్ష ఐక్యవేదిక విన్నవించు కుంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జానంపేట రాములు ,రమేష్ ,పొట్టినూనె గోపాలకృష్ణ నాయుడు, వైఎస్ఆర్టీపీ సతీష్, రియల్ దారులు మరికుంట శాంతన్న వస్త్యా నాయక్ , బాలయ్య, సత్యనారాయణ గౌడ్, వెంకట సాగర్, బాలపీరు, ఎల్లయ్య, బాలస్వామి, యాదగిరి, మన్యం తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube