క్రమ బద్ధికరణ ధరకాస్తు ల ప్రక్రియ వేగవంతం చేయాలి

క్రమ బద్ధికరణ ధరకాస్తు ల ప్రక్రియ వేగవంతం చేయాలి

1
TMedia (Telugu News) :

క్రమ బద్ధికరణ ధరకాస్తు ల ప్రక్రియ వేగవంతం చేయాలి

టీ మీడియా,సెప్టెంబర్ 22, భద్రాద్రి కొత్త గూడెం:ప్రభుత్వ ఉత్తర్వులు 59 ప్రకారం ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులు ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. గురువారం ప్రభుత్వ ఉత్తర్వులు 59 ప్రకారం ఇంటి స్థలాలు క్రమబద్దీకరణ ప్రక్రియ, సర్దుబాటు చేసిన విఆర్ఓలకు వేతనాలు చెల్లింపు అంశాలపై జిల్లా అధికారులు,తహశీల్దార్లతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులు 59 ప్రకారం కొత్తగూడెం, పాల్వంచ, దమ్మపేట, అశ్వారావుపేట, ఇల్లందు, లక్ష్మిదేవిపల్లి, అన్నపురెడ్డిపల్లి, ముల్కలపల్లి, పినపాక, మణుగూరు, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాల నుండి మొత్తం 372 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. మండలస్థాయిలో విచారణకు తహసిల్దార్, నాయబ్ తహసిల్దార్, డిప్యూటీ సర్వేయర్, సర్వేయర్లుతో టీములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సజావుగా, సక్రమంగా నిర్వహించుటకు పర్యవేక్షణ చేసేందుకు 17 మంది జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు చెప్పారు. ఇంటి స్థలాలు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించినందున, ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించి అర్హులకు క్రమబద్ధీకరణ పట్టాలు జారీ చేయుటకు జాబితా సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు.

 

Also Read : ఒక్కరికి ఒకటే పోస్ట్‌ : రాహుల్‌ గాంధీ

 

అర్హులకు క్రమబద్దీకరణ పట్టాలు జారీ ప్రక్రియకు రానున్న 24 వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి సమగ్ర నివేదికలు అందచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి విచారణలో ఇంటి కొలతలు ప్రభుత్వం నిర్దేశించిన యాప్లో పక్కాగా అప్ లోడ్ చేయాలని చెప్పారు. క్షేత్రస్థాయి విచారణకు వచ్చే అధికారులకు దరఖాస్తు దారులు ఆధారాలు అందచేయాల్సి ఉన్నదని చెప్పారు. క్షేత్రస్థాయి విచారణలో అధికారులకు చూపాల్సిన ధ్రువీకరణ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసిన నేపథ్యంలో విఆర్ఓలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేశామని, సర్దుబాటు చేసిన విఆర్ ఓలకు వేతనాలు చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేతనాలు చెల్లింపులో జాప్యం చేయొద్దని, తక్షణమే బిల్లులు రూపొందించి ట్రెజరీ కార్యాలయంలో సబ్మిట్ చేయాలని చెప్పారు. వేతనాలు ఎట్టి పరిస్థితుల్లో జాప్యం కావొద్దని, వేతన బిల్లులు రూపకల్పనపై నివేదికలు అందచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, ఆర్డిఓ స్వర్ణలత, అన్ని శాఖల జిల్లా అధికారులు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube