విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాలంటీర్లు తొలగింపు

0
TMedia (Telugu News) :

టీ మీడియా అక్టోబర్ 28 శ్రీశైలం

శ్రీశైలం మండలం, సున్నిపెంటలోని విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఎంపీడీవో మోహన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాలంటీర్ల వద్ద ఉన్న బయోమెట్రిక్, మొబైల్ ఫోన్లు పంచాయితీ కార్యదర్శికి అప్పజెప్పాలని ఆదేశించారు.
ప్రభుత్వ పథకాల పంపిణీలో గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు వాలంటీర్లు పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు ఎంతో ఉన్నత ఆశయంతో రూపొందిన సచివాలయాల వ్యవస్థకు చెడ్డ పేరు వచ్చేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదన్నారు. లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎవరికీ ఒక్క రూపాయి చెల్లించాల్సిన పని లేదని ఒకవేళ ఎవరైనా అలా అడిగితే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకు రావాలని కోరారు.

Removal of volunteers who have been negligent in their duties.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube