ఇంట్లో ప్రతికూలతను తొలగించేందుకు ఈ మార్పులు చేస్తే.?

ఇంట్లో ప్రతికూలతను తొలగించేందుకు ఈ మార్పులు చేస్తే.?

0
TMedia (Telugu News) :

ఇంట్లో ప్రతికూలతను తొలగించేందుకు ఈ మార్పులు చేస్తే.?

లహరి, జులై 24, ఆధ్యాత్మికం : ఇంట్లో సుఖ సంపదలు నెలకొని ఉండడంలో వాస్తు శాస్త్రం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితానికి డబ్బులు అనేక ప్రాథమిక అవసరం. మానవ సంబంధాల్లో డబ్బులు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరూ పరిపూర్ణమైన, విజయవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. ప్రజలు ఎల్లప్పుడూ డబ్బు సంపాదన కోసం వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఒకొక్కసారి ఎంత కష్టపడినా అందుకు తగిన ఫలితాలను అందుకోరు. ఇలా జరగడానికి ఒకొక్కసారి ఇంట్లో వాస్తు లోపాలు కూడా కారణం కావొచ్చు. చాలామంది వాస్తు శాస్త్రం పక్కకు పెట్టి ఇంటిని నిర్మించుకోవడంతో ఆ ఇంటిలోని సభ్యులు ఆర్ధిక స్థితిపై గణనీయ ప్రభావం చూపిస్తుంది. డబ్బు అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. వాస్తు శాస్త్రం ప్రకారం పంచభూతాలైన 5 అంశాలు అంటే అగ్ని, నీరు, భూమి, గాలి ఆకాశం కలయిక. ఈ మూలకాలలో ఏవైనా సమతుల్యం కానట్లయితే దీని ప్రతికూల ప్రభావం ఇంట్లో చూపిస్తుంది. కనుక వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ ఇంటిని నిర్వహిస్తే.. ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు దరిచేరవు. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం ఇంట్లో ప్రతికూలతను తొలగించే 5 ముఖ్యమైన మార్పుల గురించి తెలుసుకుందాం..

1. హిందూ గ్రంధాల ప్రకారం కుబేరుడు సంపద , శ్రేయస్సు కు అధినేత. ఈశాన్య దిక్కును కుబేరుడు పరిపాలిస్తాడు కనుక ఈ దిశలో టాయిలెట్, షూ రాక్‌ల వంటి ప్రతికూల శక్తిని ఏర్పరిచే ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు. ఒకవేళ ఈ దిశలో ఇవి ఉంటె వెంటనే తొలగించాలి. మీ ఇంటి ఈశాన్య మూలను ఎటువంటి బరువు లేకుండా ఖాళీగా ఉండేలా చూసుకోండి. అంతేకాదు. ఈ దిశలో కుబేర యంత్రాన్ని కూడా ఉంచవచ్చు.
2. పడమర, ఆగ్నేయ దిశలలో డస్ట్‌బిన్ లేదా స్క్రాప్‌ను ఉంచకూడదని ప్రజలు గుర్తుంచుకోవాలి. ఆర్థిక, డబ్బుకు అడ్డంకులు సృష్టింస్తుంది. కనుక ఈ దిశలో డస్ట్ బిన్ ఏర్పాటు చేసుకున్నట్లు అయితే వెంటనే దాని స్థానాన్ని మార్చుకోవాలి.

Also nread:రెండేళ్ల లో ఖమ్మం స్వరూపం మారుతుంది

 

3. ఇంటికి ఈశాన్య దిశలో నీటి ఫౌంటెన్ లేదా నీటికి సంబంధించిన ఇతర వస్తువులను ఉంచాలి. ఇది డబ్బు ఇబ్బందులను తొలగిస్తుంది. ఈ దిశలో అక్వేరియం లేదా వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేసుకోవడం శుభప్రదం. అయితే నీరు మురికిగా మారకముందే ఆ నీటిని మారుస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రవహించే నీరు ధన ప్రవాహానికి చిహ్నం. నిలిచిపోయిన నీరు డబ్బు ప్రవాహానికి అడ్డంకులను సృష్టిస్తుంది. కనుక ఈశాన్య దిశలో పెద్ద వాటర్ ట్యాంకర్ లేకుండా చూసుకోండి ఎందుకంటే ఇది ఆరోగ్య పరంగా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.
4. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎక్కడైనా నీరు లీకేజీ అయితే డబ్బు పరంగా అశుభం. ఇది ఆర్థిక నష్టానికి చిహ్నం. కనుక ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో నీటి లీకేజీ లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా లీకేజీ ఉంటే వీలైనంత త్వరగా పరిష్కరించాలి లేకుంటే భారీ ఆర్ధిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
5. వాస్తు శాస్త్రం ప్రకారం వాయువ్య, ఈశాన్య మూలల్లో మరుగుదొడ్డిని ఏర్పాటు చేసుకోకూడదు. ఒకవేళ అవి ఈశాన్య, వాయువ్య, ఆగ్నేయ, నైరుతి మూలల్లో నిర్మించబడినట్లయితే, అది చాలా ప్రతికూలతను తెస్తుంది. ఇది ఆర్థిక నష్టాలకు, ఆరోగ్య పరంగా ఇబ్బందులను కలిగిస్తుంది.
6. ఇంటిలో పూజ గదిలో గంట మ్రోగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది ప్రతికూలతను నిరోధించే విశ్వ ధ్వని శక్తిని సృష్టిస్తుంది. లాకర్ ఉంచిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల అగరుబత్తీలు వెలిగించడం సానుకూలతను తెస్తుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube