సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డుకు మరమ్మత్తులు
సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డుకు మరమ్మత్తులు
సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డుకు మరమ్మత్తులు
టీ మీడియా, ఫిబ్రవరి 16, మధిర : మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లందులపాడు గ్రామ సమీపంలో ఉన్న మధిర సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు గుంతల తేలి ప్రమాదకరంగా ఉండడంతో స్పందించిన మధిర సబ్ రిజిస్టార్ శీలం రామకిషోర్ రెడ్డి రోడ్డు మరమ్మత్తులు చేయించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రోక్లైన్ తో రోడ్డు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించి గుంతలను పూడ్చి వేయించారు. అదేవిధంగా పెద్దపెద్ద గుంతలలో మట్టి తోలించారు. అదే అదే విధంగా కార్యాలయానికి పక్కన ఉన్న డొంక రోడ్డుకు కూడా మరమత్తులు చేయించారు. దీంతో కక్షిదారులతోపాటు , రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్పందించిన సబ్ రిజిస్టార్ ను పలువురు అభినందించారు.