చైనా క్రూర‌త్వంపై ఐక్య‌రాజ్య‌స‌మితి రిపోర్ట్‌

చైనా క్రూర‌త్వంపై ఐక్య‌రాజ్య‌స‌మితి రిపోర్ట్‌

1
TMedia (Telugu News) :

చైనా క్రూర‌త్వంపై ఐక్య‌రాజ్య‌స‌మితి రిపోర్ట్‌

టీ మీడియా, సెప్టెంబర్ 01, వాషింగ్ట‌న్‌: చైనా దారుణ‌మైన రీతిలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి త‌న నివేదిక‌లో ఆరోపించింది. జిన్‌జియాంగ్ ప్రావిన్సులో ఉయిగ‌ర్ ముస్లింల‌పై ఆ దేశం ఊచ‌కోత‌కు దిగిన‌ట్లు యూఎన్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది. ఉయిగ‌ర్ ముస్లింల‌తో పాటు ఇత‌ర మైనార్టీల‌పై డ్రాగ‌న్ హింస‌కు దిగిన‌ట్లు యూఎన్ తెలిపింది. ఆ రిపోర్ట్‌ను చైనా ఖండించింది. పాశ్చాత్య దేశాలు త‌ప్పుడు నివేదిక‌ను రూపొందించిన‌ట్లు చైనా విమ‌ర్శించింది.

 

Also Read : మాండ్యా జిల్లాలో వెల్లివిరిసిన మతసామరస్యం

ఉయిగ‌ర్ ముస్లింల‌ను చిత్ర‌హింస పెట్టిన అంశానికి సంబంధించిన విశ్వ‌స‌నీయ‌మైన ఆధారాల‌ను గుర్తించామ‌ని, ఇది మాన‌వ‌త్వానికి జ‌రిగిన హింస అని యూఎన్ త‌న రిపోర్ట్‌లో చెప్పింది. మైనార్టీల హ‌క్కుల్ని కాలరాసేందుకు జాతీయ భ‌ద్ర‌తా చ‌ట్టాల‌ను చైనా వాడుకున్న‌ట్లు ఆరోపించింది. యూఎన్‌కు చెందిన మాన‌వ హ‌క్కుల హై క‌మీష‌న‌ర్ ఈ నివేదిక‌ను త‌యారు చేశారు. ఖైదీల‌ను చాలా నీచంగా చూశార‌ని, లైంగిక వేధింపులు కూడా జ‌రిగిన‌ట్లు యూఎన్ త‌న రిపోర్ట్‌లో ఆరోపించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube