జ‌య‌ల‌లిత మృతిపై రిపోర్ట్

జ‌య‌ల‌లిత మృతిపై రిపోర్ట్

1
TMedia (Telugu News) :

 

జ‌య‌ల‌లిత మృతిపై రిపోర్ట్

టీ మీడియా ,ఆగస్టు 27, చెన్నై: త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతిపై రిటైర్డ్ జ‌డ్జి అరుముఘ‌స్వామి క‌మిష‌న్ త‌న రిపోర్ట్‌ను స‌మ‌ర్పించింది. 590 పేజీల‌తో త‌యారైన ఆ నివేదిక‌ను ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్‌కు ఇవాళ అంద‌జేశారు. జ‌య మృతిచెందిన అయిదేళ్ల త‌ర్వాత ఆమె మృతి రిపోర్ట్‌ను పూర్తి చేశారు. గ‌తంలో ఉన్న అన్నాడీఎంకే ప్ర‌భుత్వం జ‌య మ‌ర‌ణంపై అరుముఘ‌స్వామి క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసింది.

Also Read : గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

2017, న‌వంబ‌ర్ 22న ఆ క‌మిష‌న్ ద‌ర్యాప్తును ప్రారంభించింది. జ‌స్టిస్ అరుముఘ‌స్వామి మ‌ద్రాసు హైకోర్టులో జ‌డ్జిగా చేసి రిటైర్ అయ్యారు. జ‌య మృతికి దారితీసిన కార‌ణాల‌ను క‌మిష‌న్ త‌న రిపోర్ట్‌లో పొందుప‌రిచింది. చెన్నై అపోలో ఆస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ జ‌య ప్రాణాలు విడిచిన విష‌యం తెలిసిందే. 2016 సెప్టెంబ‌ర్ 22వ తేదీన ఆమె ఆ ఆస్పిట‌ల్‌లో చేఆరు. 2016, డిసెంబ‌ర్ 5వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే విచార‌ణ‌లో భాగంగా అరుముఘ‌స్వామి క‌మిష‌న్ సుమారు రెండు వంద‌ల మందిని ప్ర‌శ్నించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube