వినతిపత్రం అందజేసిన విఆర్ఏలు

వినతిపత్రం అందజేసిన విఆర్ఏలు

1
TMedia (Telugu News) :

వినతిపత్రం అందజేసిన విఆర్ఏలు

టీ మీడియా, మార్చి 15, వనపర్తి : మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండల తాహసిల్దార్ కార్యాలయంలో నైట్ డ్యూటీ చేస్తున్న కొత్తపల్లి గ్రామం వీఆర్ఏ దుర్గం రాజును గుర్తుతెలియని దుండగులు రెండు రోజుల క్రితం హత్య చేయడం జరిగింది. మళ్లీ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని మా తోటి వీఆర్ఏ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అదేవిధంగా 2013లో నైట్ డ్యూటీల విషయంలో వీఆర్ఏలకు ఎటువంటి సంబంధం లేదని సంబంధిత జీవో కాపీతో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కి వీఆర్ఏల సంఘం తరఫున అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య, రాములు, సురేష్ ,భాగ్యలక్ష్మి, లక్ష్మీ, కృష్ణవేణి, శివమ్మ తదితరులు పాల్గొన్నారు.

Also Read : మృతులకు టిఆర్ఎస్ నేతల నివాళి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube