ఉపాధ్యాయ భవనంగానే ఉండాలని కోరుతూవినతిపత్రం

ఉపాధ్యాయ భవనంగానే ఉండాలని కోరుతూవినతిపత్రం

1
TMedia (Telugu News) :

ఉపాధ్యాయ భవనంగానే ఉండాలని కోరుతూవినతిపత్రం

టీ మీడియా, మార్చి 11, వనపర్తి : పట్టణంలోని రాజీవ్ చౌక్లో ఉన్న ఉపాధ్యాయ భవనం షాపులుగా మార్చడం ఉపాధ్యాయ భవనంగానే ఉండాలని కోరుతూ అఖిల పక్ష నాయకులు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది సంవత్సరాల క్రితం ఎస్టియుగా ఉన్న అతిపెద్ద ఉపాధ్యాయ సంస్థ కోసం ఉపాధ్యాయ విశ్రాంతి భవనం ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ కాలక్రమేణా ఉపాధ్యాయ సంఘం నుంచి చీలిపోయి పలు సంఘాలుగా ఉపాధ్యాయులు ఏర్పడ్డారు. కానీ అసలు సంఘంలో ఇప్పుడు 10 మాత్రమే ఉన్నారు. అందులో తెలివైన వారు మాజీ మంత్రి జూపల్లి శిష్యులలో ఒకరు దాన్ని పెద్దగా ఉండే ఆ భవనాన్ని కమర్షియల్ షాపులు ఏర్పాటు చేశారు. కానీ అది చట్టవిరుద్ధం అప్పట్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం విశ్రాంతి భవనం ఏర్పాటు చేసింది. వారి అవసరాలకు మీటింగ్లకు మాత్రమే ఉపయోగించుకునే విధంగా జీవోలో ఉన్నది కానీ కొందరు అతి తెలివితో దాన్లో సంపాదన వెతుకుతూ సంఘానికి కొద్ది మొత్తంలో కిరాయి ఇస్తూ పర్సనల్గా ఎక్కువ ఒప్పందం చేసుకుని లాభం పొందుతున్నారని కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Also Read : కేసీఆర్ మంచిగానే ఉన్నారు

దీన్ని పరిగణనలోకి తీసుకొని వనపర్తి అఖిలపక్షం మున్సిపాలిటీలోని టిపిఎస్ ను సంప్రదించగా షాపుల కోసం మేము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని అది చట్ట విరుద్ధం అని చెప్పారు. కనుక వెంటనే షాపులను ప్రజల ఉపయోగం కొరకు కొందరు నుంచి తప్పించి స్వాధీనం చేసుకోవాలని లేకపోతే ఉపాధ్యాయ భవనంగా ఏర్పరిచి ఉపాధ్యాయులకు చేయాలని సర్వేపల్లి రాధాకృష్ణ భవనంగా ఏర్పరిచి ఉపాధ్యాయులందరూ కోసం మీటింగ్ హాల్ లేక విశ్రాంతి భవనం ఏర్పరచాలని వనపర్తి అఖిలపక్ష నాయకులు కోరారు. కనుక దీనిపై జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కల్పించుకొని పై విధంగా చేయగలరని కోరారు. కనుక వెంటనే దీనిపై చర్య తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు సతీష్ యాదవ్, చిరంజీవి, వెంకటేష్, జయరాములు, లక్ష్మయ్య, శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube