ఎసైన్డ్, పట్టా భూములను స్వాధీనం చేసుకుంటున్నారు ఆర్డీవోకి వినతిపత్రం .*

ఎసైన్డ్, పట్టా భూములను స్వాధీనం చేసుకుంటున్నారు ఆర్డీవోకి వినతిపత్రం .*

1
TMedia (Telugu News) :

ఎసైన్డ్, పట్టా భూములను స్వాధీనం చేసుకుంటున్నారు ఆర్డీవోకి వినతిపత్రం .*
టీ మీడియా, ఏప్రిల్29,ఖమ్మం : నగరంలో గురువారం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అధికారి రవీందర్ నాథ్ కు రఘునాథపాలెం , జింకలతండా గ్రామస్తులు నిరుపేద యస్.టి. కులానికి చెందిన రైతులు వినతి పత్రాన్ని అందించారు . మా యొక్క తాత , మా తండ్రుల నుండి సంక్రమించినటువంటి ఎసైన్డ్ పట్టా భూములను మేము సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని , అటువంటి పరిస్థితులలో మా యొక్క భూములను ప్రభుత్వం వారు రకరకాల అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుంటున్నారని . ప్రభుత్వం వారు మాకు ప్రత్యామ్నాయం చూపెడతారనే ఆశతో మేము ఇన్ని రోజులు వేచి చూస్తున్నాము . కానీ రోజులు గడుస్తున్నా కొద్ది మాకు ఇంతవరకు ఎటువంటి సహాయం అందకపోవడంతో విచారించి మీదగ్గరకొచ్చామనీ అన్నారు . ప్రభుత్వంవారు ఇచ్చినటువంటి భరోసా వలన మేము నేటి వరకు మాట్లాడకుండా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు

Also Read:రాజకీయాలకతీతంగా సేవా కార్యక్రమాలు

 

. భూములను ప్రభుత్వం వారు తీసుకున్న దృష్ట్యా మాకు ప్రత్యామ్నాయంగా చూపించాలన్నారు . మాకు సహాయం చేసి మాకు న్యాయం చేయగలరని కోరారు . గతంలో ఈ విషయం పై మంత్రి గారిని కలిశామని అప్పుడు వారు ఎవరు భూములు పోతున్నాయో వారికి ప్రత్యామ్నాయం చూపించమని అన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు . గతంలో ఉన్న రఘునాథపాలెం ఎమ్మార్వో తిరుమలరావుని కూడా కలిశామని సానుకూలంగా స్పందించి చేద్దాం చూద్దాం అని అన్నారు . ఆ తర్వాత కి వారు మరోచోటకి బదిలీ మీద వెళ్లిపోయారని తెలిపారు . ఇప్పుడు ఉన్న రఘునాథపాలెం తహసీల్దారు నరసింహారావు దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కావున వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో అంగోత్ మంగ్యా , మాళోత్ లచ్చిరాం (లేటు) , నాగేశ్వరరావు , బానోత్ కూనా, చల్లా వెంకటేశ్వర్లు , గమస శేషయ్య , బోడ శంకర్ , బాణోత్ కృష్ణ, బోడా సోమ్లా, బోడ వీరన్న , బోడ నాగరాజు , చల్లా నర్సయ్య , తులసి , సాలిక్ , సరోజా తదితరులు పాల్గొన్నారు.

Also Read:భార్యను కత్తితో పొడిచిన్న భర్త

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube