సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కి వినతి
-పత్రంఅందజేసిన సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క
(టీ మీడియా, జనవరి 18,ఖమ్మం:)
శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారికి నమస్కారములు.
విషయం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిష్కరించబడకుండా ఉన్నటువంటి
కొన్ని సమస్యల గురించి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనాదిగా పరిష్కరింపబడకుండ ఉన్నటువంటి కొన్ని సమస్యలను మీ దృష్టికి తీసుకవస్తున్నాము. వాటికి మీరు సహృదయంతో పరిష్కార మార్గాలు చూపిస్తారని ఈ క్రింది సమస్యలు మీ దృష్టికి తీసుకవస్తున్నాము.
1) అనాదిగా అడవిప్రాంతాన్ని నమ్ముకొని పోడువ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అటవి భూమి రక్షణ చట్టం ద్వారా వారు సాగుచేస్తున్న భూమికి పట్టాలు తక్షణమే అబ్దిదారులకు అందజేయాలి. ఇటీవల జరిగిన భూమి సర్వే అవకతవకలను సరిచేయవలసినటువంటి అవసరం ఉన్నది.
2) గడిచిన ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామి మేరకు రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం అశించిన స్థాయిలో లేదు. తక్షణమే ఖమ్మం జిల్లాకు రెండు పడకల గదుల ఇండ్లు మంజూరు చేయగలరని కోరుతున్నాము
3) గతంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మధిర ప్రాంతంలో మహిళలు అసక్తిచూపిన “ఇందిరమ్మడైరి” స్కీమ్‌ను విస్తృత ప్రాతిపదికన మంజూరు చేయవలసినదిగా కోరుతున్నాము.
4) సింగరేణి బొగ్గుగన్నుల్లో 51 శాతం వాటా కలిగిన రాష్ట్రప్రభుత్వం దానిపై అజమాయిషి వహించి బొగ్గుగనులను ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కేంద్ర నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం చొరవ చూపించి ప్రైవేటీకరణను అడ్డుకోవలసినదిగా కోరుతున్నాము.
5) ప్రతి ఉమ్మడి జిల్లాకు రాష్ట్రంలో యునివర్సిటిని మంజూరు చేసారు. అందుకు ఖమ్మం జిల్లా మాత్రం యునివర్సిటికి నోచుకోలేదు. తక్షణమే ఖమ్మం జిల్లాకు యునివర్సిటిని మంజూరు చేయవలసినదిగా కోరుచున్నాము.
Also Read : జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి
6 మధిర శాసన సభ నియోజక వర్గానికి జిల్లా మొత్తానికి ఉపాధ్యాయులను అందించినటువంటి ఘనత పొందినటువంటి మధిరకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కలశాల మంజూరు చేయవలసినదిగా కోరుతున్నాము.
7) రాష్ట్ర విభజనలో హక్కుగా పొందినటువంటి బయ్యారం ఉక్కుప్యాక్టరిని మంజూరు చేయించి తక్షణమే సంబంధిత పనులు ప్రారంబించి జిల్లా ప్రజల కలలు నేరవేర్చాలని కోరుచున్నాము.
8) ధరణి సమస్యలు తక్షణమే పరిష్కరించి పాస్‌పుస్తకాలు అందజేయుటకు రెవిన్యూ అధికారులను అదేశించవలసినదిగా కోరుచున్నాము.
9) జర్నలిస్టులకు ఇండ్ల ప్లాట్లు మంజూరు చేయవలసినదిగా కోరుచున్నాము.
10) అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయవలసినదిగా కోరుచున్నాము.
పైన పేర్కోనబడినటువంటి అంశాలు జిల్లా ప్రజల అకాంక్షలు వీటితో ముడిపడిఉన్నాయి. అందుచేత ఇవి ప్రాదాన్యత కలిగినటు వంటి సమస్యలుగా మిగిలి ఉన్నాయి. వీటిని సహృదయంతో మీరు పరిశీలించి వీటిపై తగినంత త్వరలో నిర్ణయం తీసుకొని ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్షలు నేరవేరుస్తారని ఆశిస్తున్నాము.
ఇట్లు
భట్టి విక్రమార్కమల్లు
సీఎల్పీ లీడర్
మధిర శాసనసభ్యులు