చెరువు కాపాడాలని తాసిల్దార్ కు వినతిపత్రం

చెరువు కాపాడాలని తాసిల్దార్ కు వినతిపత్రం

1
TMedia (Telugu News) :

చెరువు కాపాడాలని తాసిల్దార్ కు వినతిపత్రం

టీ మీడియా,జూన్ 29, జన్నారం:పొనకల్ గ్రామ శివారులో గల చెరువును కబ్జాదారుల నుండి కాపాడాలని తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. పోన్కల్ గ్రామంలో గల చెరువు ఆయకట్ట రైతులు ,మృత్యుకారులు, గౌడ సంఘం సభ్యులు గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 400 లో గల చెరువు రోజురోజుకు కబ్జా గురవుతుందని, చెరువు శికాలలో ఎలాంటి లావాదేవీలు జరపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ,2016 నుండి ఇప్పటివరకు హద్దురాళ్ల విషయమై ఎన్నిసార్లు వినతి పత్రం సమర్పించిన ఎలాంటి స్పందన లేదని ,దయచేసి ప్రజాసంక్షేమం కొరకు చెరువులను పరిరక్షించుటకై నీటిపారుదల శాఖ సర్వే ప్రకారం రెవెన్యూ రికార్డులతో చేరుస్తూ వెంటనే చెరువు హద్దురాళ్ళు ఏర్పాటు చేయవలసిందిగా బుధవారం రోజున ప్రజలు తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

Also Read : జ‌మునా హేచ‌రీస్ ఆక్ర‌మిత‌ భూముల పంపిణీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube