టీ మీడియా,డిసెంబర్ 10,కరకగూడెం:
భట్టుపల్లి ప్రాంతమైన ప్రభుత్వం భూములలో గిరిజనేతరులు బౌల అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారని,ప్రశ్నించిన సర్పంచ్,సెక్రెటరీ పై పేపర్ ను అడ్డుపెట్టుకొని అడ్డగోలు వార్తలు వ్రాస్తున్నారని తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు కొమరం వెంకటేశ్వర్లు అన్నారు.
అనంతరం ప్రభుత్వం భూమిలో నిర్మాణాలు చేస్తున్న వారిపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేస్తామని,సంబంధిత తహశీల్దార్ కు తుడుందెబ్బ మండల అధ్యక్షుడు ఊకె గణేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా నాయకులు సుతారి నాగేశ్వర రావు,సోలం రామారావు,గొగ్గల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.