ట‌న్నెల్ కార్మికుల‌కు 5 మీట‌ర్ల దూరంలో రెస్క్యూ బృందం

ట‌న్నెల్ కార్మికుల‌కు 5 మీట‌ర్ల దూరంలో రెస్క్యూ బృందం

0
TMedia (Telugu News) :

ట‌న్నెల్ కార్మికుల‌కు 5 మీట‌ర్ల దూరంలో రెస్క్యూ బృందం

టీ మీడియా, నవంబర్ 28, డెహ్రాడూన్‌ : ఉత్త‌రాఖండ్‌లోని సిల్కియారా ట‌న్నెల్‌ లో రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. 41 మంది కార్మికులను ర‌క్షించేందుకు డ్రిల్లింగ్ జ‌రుగుతోంది. అయితే రెస్క్యూ బృందానికి మ‌రో 5 మీట‌ర్ల దూరంలోనే కార్మికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం పైప్‌లైన్‌లో ఉన్న శిథిలాల‌ను తొల‌గిస్తున్నారు. ర్యాట్ హోల్ మైన‌ర్లు మాన్యువ‌ల్ డ్రిల్లింగ్ చేస్తున్నారు. నేటికి రెస్క్యూ ఆప‌రేష‌న్ 17వ రోజుకు చేరుకున్న‌ది. మాన్యువ‌ల్ డ్రిల్లింగ్ 50 మీట‌ర్ల దూరం దాటేసిన‌ట్లు అధికారులు చెప్పారు. ర్యాట్ హోల్ మైనింగ్‌కు చెందిన 24 మంది సిబ్బంది మాన్యువ‌ల్‌ డ్రిల్లింగ్ చేస్తున్నారు. సుర‌క్షిత‌మైన మార్గాన్ని వేసేందుకు రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. ట‌న్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల‌కు.. రెస్క్యూ బృందం మ‌రో అయిదు మీట‌ర్ల దూరంలో ఉంది. రెస్క్యూ ఆప‌రేష‌న్ జ‌రుగుతున్న ట‌న్నెల్ వ‌ద్ద‌కు ఇవాళ ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ థామి వెళ్లారు.

Also Read : లింగాల కమల రాజ్ విజయాన్ని కోరుకుంటూ

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube