ఘనంగా రిజర్వేషన్స్ డే వేడుకలు

ఘనంగా రిజర్వేషన్స్ డే వేడుకలు

1
TMedia (Telugu News) :

ఘనంగా రిజర్వేషన్స్ డే వేడుకలు.

టి మీడియా జూలై 27 చిన్నంబావి:-

చిన్నంబాయి మండల కేంద్రం లో మండల ఇంచార్జ్ దేవని రాజు ఆధ్వర్యంలో రిజర్వేషన్స్ డే
కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి కొల్లాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు మునిస్వామి గారు మాట్లాడుతూ ఈ దేశంలో బ్రాహ్మణేతర కులాల ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, తన కొల్హాపూర్ సంస్థానం లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన గొప్ప మహనీయుడు,
రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్ అని కొనియాడారు. సాహూ మహారాజ్ కల్పించిన రిజర్వేషన్లను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో చట్ట రూపంలో పొందుపరిచాడు, అని అన్నారు.

 

Also Read : బోనాల పండగ సందర్భంగా అమ్మ వారికి ప్రత్యేక పూజలు

 

అదేవిధంగా దేశంలో దేవాలయాలను విద్యాలయాలుగా మార్చిన మహానీయుడు నారాయణ గురు అని తెలియజేశారు. మహనీయుల ఆలోచన విధానం ఆశయాల కోసం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు రాజ్యాధికారాన్ని అందించడమే లక్ష్యంగా కాన్షి రామ్ గారు బహుజన సమాజ్ పార్టీ ని స్థాపించారని, ఈ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం అందించడమే లక్ష్యంగా డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ బీసీలకు 70 సీట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్నంబాయి మండల కన్వీనర్, బండారు వెంకటేష్ బెక్కెం గ్రామ అధ్యక్షులు డి ఎన్ కృష్ణ, బొల్లి కురుమయ్య, రామకృష్ణ ములకలపల్లి బాలు, సాయి, తగరం బాలకృష్ణ, స్వామి,కేశవులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube