గిరిజన రిజర్వేషన్ వెంటనే 10 శాతం పెంచాలి

గిరిజన రిజర్వేషన్ వెంటనే 10 శాతం పెంచాలి

1
TMedia (Telugu News) :

గిరిజన రిజర్వేషన్ వెంటనే 10 శాతం పెంచాలి

టీ మీడియా మార్చి 120 కొణిజర్ల :తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు జనాభా 10 శాతం కలిగి ఉన్నారని రాజ్యాంగబద్ధంగా ఆయా రాష్ట్రాల జనాభా నిష్పత్తిని బట్టి రిజర్వేషన్ పెంచుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని . వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పది శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. శనివారం కొణిజర్ల జరిగిన గిరిజన సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ధరావతు నంద్యా నాయక్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ముఖ్యమంత్రి 90 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు వీటిలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.

Also Read : నూతక్కి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పువ్వడా

పోడు గిరిజన రైతులకు ఏంటది హక్కు పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామాలకు గుర్తించాలని కోరారు. వైరస్ దోమలతో దెబ్బతిన్న మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు వైఫల్యం చెందాయని ఆందోళన వ్యక్తం చేశారు . ఖమ్మం జిల్లా గిరిజన అభివృద్ధి కోసం వెంటనే ఐ టి డి ఎ ను ఏర్పాటు చేయాలని కోరారు.క ప్రభుత్వాలు స్పందించకపోతే గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళనా పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గిరిజన సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు బానోతు హరిచంద్ తేజావత్ సీతారాములు మండల నాయకులు తేజావత్ కృష్ణకాంత్, ధరావత్ నరసింహారావు , భూక్యా నాగేశ్వరరావు , భూక్యా లచ్చు లాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube