పంజాబ్ పిసిసి అధ్యక్షుడు రాజీనామా

పంజాబ్ పిసిసి అధ్యక్షుడు రాజీనామా

1
TMedia (Telugu News) :

పంజాబ్ పిసిసి అధ్యక్షుడు రాజీనామా

టి మీడియా, మార్చి 16,చంఢీగఢ్‌: పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశం మేరకు సిద్ధూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకుగానూ కాంగ్రెస్‌ 18 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవులకు రాజీనామా చేయాల్సిందిగా సోనియా గాంధీ ఆదేశించారు. దీంతో వెంటనే యూపీ పీసీసీ అధ్యక్షుడు అజయ్‌కుమార్‌ లల్లూ, ఉత్తరాఖండ్‌ చీఫ్‌ గణేశ్‌ గోదియాల్‌ ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు.

Also Read : సీ సీ రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube