సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వార పరిష్కరిద్దాం

సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వార పరిష్కరిద్దాం

0
TMedia (Telugu News) :

సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వార పరిష్కరిద్దాం

– సీఎం రేవంత్‌

టీ మీడియా, డిసెంబర్ 14, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వారా పరిష్కరిద్దామని చెప్పారు. స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా వికారబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ ఎన్నికయ్యారు. ఆయనతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణం చేశారు. అనంతరం సీఎంతో సహా ఇతర సభ్యులు అధినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. సభ తొలిరేజే మంచి సంప్రదాయానికి నాంది పిలికిందన్నారు. భవిష్యత్‌లోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలన్నారు. ఆరోగ్యవంతమైన ప్రాంతంగా వికారబాద్‌కు పేరుందని చెప్పారు. వికారాబాద్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రసాద్‌ కుమార్‌కు అభినందనలు. ఆయన అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చారని తెలిపారు. సభలో సభ్యులందరి హక్కులు కాపాడుతారని నమ్మకం ఉందని చెప్పారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.

Also Read : రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర జోక్యాన్ని అడ్డుకోండి

మంత్రిగా ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్‌ చేనేత సమస్యలను పరిస్కరించారని చెప్పారు. ఆయనతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా గడ్డం ప్రసాద్‌ సలహాలు ఇవ్వాలని చెప్పారు. స్పీకర్‌ ఎన్నికకు సహకరించిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారం దిశగా సభను నడుపుతారని ఆశిస్తున్నాని అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube