సెక్యూరిటీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం

వాసిరెడ్డి సీతారామయ్య

1
TMedia (Telugu News) :

సెక్యూరిటీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం

 

– వాసిరెడ్డి సీతారామయ్య

 

టీ మీడియా, డిసెంబర్ 5, గోదావరిఖని : సింగరేణి లో సెక్యూరిటీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి,వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని ఎస్ అండ్ పి.సి డిపార్ట్మెంట్ లో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ…సింగరేణి లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘం గా ఉన్నప్పుడు సెక్యూరిటీ సిబ్బంది సమస్యల పరిష్కారం కృషి చేయడం జరిగిందని, ముఖ్యంగా సింగరేణి యాజమాన్యం సింగరేణి లో పని చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది స్థానం లో సి.ఐ.ఎస్.ఎఫ్.ను ప్రవేశపెడితే ఏఐటీయూసీ అడ్డుకొని ఎస్ అండ్ పి.సి.ని కొనసాగించే విధంగా పోరాటాలు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.

Also Read : సర్పంచి కి అక్రిడేషన్ కార్డు

బొగ్గు గనులు ప్రైవేటు వారికి వెళితే సింగరేణి, కోల్ ఇండియా మనుగడ కష్టమని ఆయన పేర్కొన్నారు.బొగ్గు బ్లాక్ ల టెండర్ ప్రక్రియ ను రద్దు చేసి సింగరేణి కి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు, లేనిచో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ సమావేశంలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కన్వీనర్ ఆరెల్లి పోషం,డిపార్ట్మెంట్ కార్యదర్శి రెడ్డి వెంకట స్వామి,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube