రెజో నెన్స్ హాస్టల్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
-గుట్టు చప్పుడు కాకుండా హాస్పటల్ కు తరలింపు
-వసతి గృహం నిర్వహణ పైన అనుమానం
టి మీడియా,మే14, ఖమ్మం:నగరం లోని ప్రముఖ జూనియర్ కళాశాల హాస్టల్ ఉద్యోగి గోపాలరావు అనుమానాస్పద మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.. మృతుడిది చింతకాని గ్రామం .ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది.మృతుడు గురించిన విషయం పోలీస్ కు,బంధువులకు తెలపకుండా మరణ ధ్రువీకరణ డాక్టర్లు చేసిన అనంతరం సమాచారం ఇవ్వడం అనుమానం కలిగిస్తోంది. రెజోనెన్స్ హాస్టల్ నిర్వహణకు ఉన్న ప్రభుత్వ అనుమతులు పై కూడా చర్చ సాగుతోంది. నగరం లో కొన్ని విద్య సంస్థలు నిర్వహిస్తున్న అనధికార హాస్టళ్లు లాగా ,రేజోనెన్స్ కూడా అనధికారిక హాస్టల్ నడుపుతున్న ట్లు తెలుస్తోంది.హాస్టల్ ఉద్యోగులు అందరూ శుక్రవారం రాత్రి మద్యం పార్టీ చేసుకొన్నారని.. ఆ క్రమంలో జరిగిన ఘర్షణ లో గోపాలరావు మరణించడని ఆరోపంచా రు. హాస్టలు లో మద్యం పార్టీ జరుగ లేదు అని యజమానులు పేర్కొంటున్నారు..
Also Read : పట్టణ ప్రగతిలో కార్పొరేషన్ కు రాష్ట్ర స్థాయి అవార్డు
అసలేమి జరిగింది
విద్యాసంస్థ ల హాస్టళ్లలో ఏమి జరుగుతోంది అన్న చర్చ సాగుతోంది.అనుమతులు లేకుండా,కనీస బద్రత చర్యలు లేకుండా కొన్ని విద్యాసంస్థలు హాస్టళ్లనడుపుతున్నారు.అక్కడ సిబ్బంది ని తక్కువ వేతనం తో నియముంచడం
,పని చేస్తున్న వారి భద్రత గాలికి వదిలేయడం, వారి రాత్రి బసలు హాస్టళ్ల లోనే ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది.ఆ క్రమం లోనే రెజోనెన్స్ కళాశాలలో గోపాలరావు మరణం అనేది స్పష్టం అవుతుంది. ఇకనేనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని హాస్టళ్ల పై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.