నిరసన కార్యక్రమానికి స్పందించిన అధికారులు

నిరసన కార్యక్రమానికి స్పందించిన అధికారులు

1
TMedia (Telugu News) :

నిరసన కార్యక్రమానికి స్పందించిన అధికారులు

టీ మీడియా, అక్టోబర్ 18, వనపర్తి బ్యూరో : అక్టోబర్ 13న దళిత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో మారెమ్మ కుంట నుండి కర్రెమ్మ గుడి వరకు రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది, ఈ క్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు ప్రారంభించడం 5,18,19, 21వ వార్డు ప్రజలకు కాశీం నగర్, తాండ ప్రజలకు శుభ పరిణామం.

Also Read : సేవింగ్స్‌పై వడ్డీ రేటు పెంచిన ఎస్బీఐ

ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, కాలనీ పెద్దలు, శ్రేయోభిలాషులకు దళిత అభివృద్ధి సంఘం పిలుపు మేరకు స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టుటకు సహకరించిన 15వ వార్డు కౌన్సిలర్ బండారు కృష్ణ కి సంఘం తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మన అందరి నైతిక విజయం ఐకమత్యంతో ఉంటే ఏ సమస్య అయినా సులభంగా సాధించుకోవచ్చు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube