పెద్దవారి పాదాలకు నమస్కారం చేయడం వలన కలిగే ఫలితాలు

పెద్దవారి పాదాలకు నమస్కారం చేయడం వలన కలిగే ఫలితాలు

1
TMedia (Telugu News) :

పెద్దవారి పాదాలకు నమస్కారం చేయడం వలన కలిగే ఫలితాలు

లహరి, డిసెంబర్19,అధ్యాత్మికం : సనాతన హిందూ సంప్రదాయంలో తనకంటే పెద్దవారి పాదాలను తాకడం శతాబ్దాలుగా కొనసాగుతోంది. హిందూమతంలో.. ఏదైనా శుభకార్యానికి ముందు లేదా ప్రారంభించే ముందు రోజు, తల్లిదండ్రులు గురువు లేదా భగవంతుని పాదాలను తాకుతారు. అయితే పాదాలను తాకడానికి కొన్ని సరైన నియమాలు ఉన్నాయని మీకు తెలుసా.. వాటిని విస్మరించడం శుభ ఫలితాలకు బదులుగా మీకు అశుభ ఫలితాలను ఇస్తుంది. పూజ సమయంలో గురువు లేదా ఇంట్లోని పెద్ద వారి పాదాలను ఎలా తాకాలి. పాదాలను తాకడంలో ఉన్న సరైన నియమాలు.. దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

 


పాదాలను తాకే సంప్రదాయం దేవతలతో కూడా ముడిపడి ఉంది పాదాలను తాకే సంప్రదాయం ఈనాటిది కాదు దేవతామూర్తుల కాలం నాటి నుంచి ఉంది. గురువుగారు రాజభవనాలకు వచ్చినప్పుడు, రాజు స్వయంగా ఆయన పాదాలను తాకి ఆశీస్సులు పొందేవారు. తమ ప్రియమైన వారికి ఆతిథ్యం ఇచ్చే ముందు వారిని గౌరవిస్తూ.. అతిథుల పాదాలను తాకినట్లు.. అలా పాదాలను తాకడమే కాకుండా పాదాలనుకడిగిన సంఘటలు కూడా ఉన్నాయి. ఇలా చేయడం మన సంప్రదాయం మాత్రమే కాదు.. పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం.పాదాలను తాకడం వలన ప్రయోజనాలు నేటి కాలంలో.. ఒకరి పాదాలను తాకడం అనేది కేవలం గౌరవ భావంతో అన్నది మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈ సంప్రదాయం వెనుక ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి. దీని వెనుక మానవజాతి సంక్షేమం ఉంది. తన కంటే పెద్దవాడైన లేదా గౌరవించ దగిన వ్యక్తి పాదాలను తాకడం ద్వారా.. అతనిలోని సానుకూల శక్తి ప్రవాహం.. మనలోకి ఆశీర్వాదాల రూపంలో ప్రవహిస్తుంది అని నమ్మకం. ఇలా చేయడం మనకు సంతోషాన్ని, శ్రేయస్సును ఇస్తుంది.పాదం తాకడంలో నియమాలు పాదాలను తాకడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. కొందరు నమస్కరిస్తారు లేదా మోకాళ్లపై కూర్చుని కొందరు నమస్కరిస్తారు. అయితే మీరు ఎవరి పాదాలనైనా తాకాలనుకున్నప్పుడు.. మీ రెండు చేతులను చాచి ఎడమ చేతితో ఎడమ పాదాన్ని, కుడి చేతితో కుడి పాదాన్ని తాకాలి.

Also Read : దేవాలయ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి

అదేవిధంగా.. సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు, మీ తలను రెండు చేతుల మధ్య ఉంచి, మీ శరీరం పైభాగాన్ని వంచి పాదాలను తాకి నమస్కరించాలి.నవ గ్రహాల దోషం తొలగించే నమస్కారం మీ కంటే పెద్దవారి పాదాలను తాకడం వల్ల నవగ్రహాలకు సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. దీనితో పాటు అమ్మమ్మ, నాన్నమ్మ, అత్త మొదలైన వారి పాదాలను తాకడం ద్వారా చంద్ర దోషాలు తొలగిపోతాయని.. అన్నయ్య పాదాలను తాకడం వలన మంగళ దోషాలు తొలగుతాయి.. వదిన పాదాలను తాకడం ద్వారా శుక్రుడు బలపడతాడని విశ్వాసం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube