త్వరలో రిటైల్ వ్యాపార పాలసీ : కేంద్రం
టీ మీడియా, మార్చ్ 7, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం త్వరలో రిటైల్ వ్యాపార పాలసీని తీసుకురానున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా వ్యాపారులకు సులభంగా రుణాలు, మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని భావిస్తోందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండిస్టీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) జాయింట్ సెక్రటరీ సంజీవ్ తెలిపారు. సోమవారం ఆయన ఓ ఇ- కామర్స్ సమావేశంలో మాట్లాడుతూ.. రిటైల్ సహా, ఆన్‌లైన్ వ్యాపారాలకు సంబంధించిన విదివి ధానాలను ఇందులో పొందుపర్చనున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఇ-కామర్స్, రిటైల్ వర్తకుల మధ్య సహకారం, సమన్వయం పెంచాలని కేంద్రం యోచిస్తోందన్నారు. అదే విధంగా రిటైలర్ల కోసం ప్రత్యేకంగా బీమాను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామన్నారు. నూతన రిటైల్ వ్యాపార విధానంతో సులభ వ్యాపారాన్ని పెంపొందించాలని భావిస్తున్నామన్నారు.