ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సన్మానం

ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సన్మానం

2
TMedia (Telugu News) :

ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సన్మానం

టీ మీడియా, ఆగస్టు 22, వనపర్తి బ్యూరో: అమరచింత మండలంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర 75 వసంతాల వజ్రోత్సవాల సందర్భంగా ప్రపంచ సీనియర్ సిటిజన్ డే సందర్భంగా ఆదివారం అమరచింత మండలంలోని ప్రముఖ రచయిత,విశ్రాంత ఉపాధ్యాయులు షేక్ అహ్మద్ ని ఆహ్వానించి ప్రత్యేక సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మండల సభ్యులు ఆయనను ఆత్మీయంగా సన్మానించుకొని ఆయనకు ప్రపంచ సీనియర్ సిటిజన్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సభ్యులు,రెడ్ క్రాస్ సోషల్ యాక్టివిటీ జిల్లా కన్వీనర్ తెలుగు తిరుమలేష్ గారు మరియు రెడ్ క్రాస్ యూత్ జిల్లా సభ్యులు , అమరచింత మండల కార్యదర్శి శ్యామ్, జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ సభ్యులు వెంకటయ్య, మండల సభ్యులు పోతు రాము,రాజు, రాజు, దేవరాజు, వేంకటేశ్వర రెడ్డి,శ్రీనువాసులు తదితరులు పాల్గొన్నారు.

 

Also Read : రోడ్లపై ఒకవైపు ప్రింట్ జాతీయ జెండాలు

 

ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 21వ తేదిన “వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే”ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఒక ఆనవాయతీగా వస్తోంది. నాటి యువతే నేటి సీనియర్ సిటిజన్స్ అని వారు కూడా దేశాల అభ్యున్నతిలో ఘనమైన పాత్రని పోషించారని పేర్కొంటూ.వారికంటూ ఒక రోజుని ఐక్యరాజసమితి కేటాయించడం జరిగింది.1990 డిసెంబర్ 14వ తేదీన, యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ.. సీనియర్ సిటిజన్స్ సమస్యలను గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించేందుకు, అలాగే వారిలో స్ఫూర్తిని నింపేందుకు తొలిసారిగా ఒక ప్రకటనను చేసింది. అప్పటి నుండి ఆగష్టు 21 తేదిన  “సీనియర్ సిటిజన్స్ డే”ని యునైటెడ్ నేషన్స్ సభ్య దేశాలు జరుపుకుంటున్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube