రేవంత్ న్నయాది మార్చినవా ..?

రేవంత్ న్నయాది మార్చినవా ..?

0
TMedia (Telugu News) :

రేవంత్ న్న  యాది మార్చినవా ..?
రేవంత్ న్నయాది మార్చినవా ..?
-2013 లో మోడీ,బాబు ప్రధాని,ఉపప్రదాని అన్నావు
-2114 జనవరి లో దేశానికి పట్టిన చీడ కాంగ్రెస్ అంటి వి
-2014 సెప్టెంబర్ లో తుమ్మలవి దిగజారుడు రాజకీయం 
– రాజకీయ విశ్లేషకులు

 

revanth with thummala
revanth with thummala

టి మీడియా ,ఆగస్టు 31,రాజకీయ ప్రతినిధి: రేవంత్ రెడ్డి గురువారం హైద్రాబాద్ లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కి ఆహ్వానం చెయ్యడం పట్ల రాజకీయ విశ్లేషకులు రేవంత్ గతం మరిచారా అని ప్రశ్నిస్తున్న రు. 2014 లో తుమ్మల టి ఆర్ఎస్ లో చేరటం పై ఆయనవి దిగజారుడు రాజకీయాలు అన్నారు.అటుతరువాత 2015 లో తుమ్మల ఏం ఎల్ ఏ ల కోటాలో ఏం ఎల్ సి గా ఎన్నిక సమయం లో ఆయనకు వ్యతిరేకంగా ప్రజా ప్రతినిధులు ను ప్రలోభ పెట్టారు అని హైద్రాబాద్ ఎసిబి సిటీ range-1 లో సి సి నెంబర్ 15/2016 నమోదు అయ్యి ప్రస్తుతం విచారణ సాగుతోంది. ఇన్ని ఉండగా అన్ని మర్చి తుమ్మల ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ కి ఆహ్వానం చెయ్యడం వెనుక రాజకీయం లో శాశ్విత శత్రువులు,మిత్రులు ఉండరు. గతం వదిలేసి వర్తమానం కోసం కొందరు పని చేస్తారు అని రేవంత్ నిరూపించారు అని అంటున్నారు.రేవంత్ మెడకి బలంగా చుట్టుకొన్న ఏసిబి కేసు రాజి కూడా తుమ్మల ఆహ్వానం అనే అభిప్రాయం ఉంది.

 

alsoread :అధికా “రి”క మట్టి మాఫియా

రేవంత్ ఎప్పుడు ఏమి అన్నారు.

దేశానికి పట్టిన చీడే కాంగ్రెస్ పాలన       

2014 జనవరి 24 న జరిగిన రాష్ట్ర శాసనసభ సమావేశాలలో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై చర్చలో భాగంగా ఆయన సభలో మాట్లాడుతూ తెలంగాణ ఇవ్వకుంటే నక్సలిజం పెరుగుతుందని అన్నారు. ఇందిరాగాంధీ సమైక్యవాది అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ శాసన సభ్యులు రేవంత్ రెడ్డి అన్నారు. . గోల్డ్ మెడలిస్ట్ లయిన తమ ప్రాంత విద్యార్థులు నక్సలిజం వైపు మళ్లటానికి సమైక్య రాష్ట్రమే కారణమని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉన్నందునే కేసీఆర్ వెనక ప్రజలు అండగా నిలిచారన్నారు. 371 డి ఆర్టికల్ రాష్ట్ర విభజనకు అడ్డుకాదన్నారు.దేశానికి పట్టిన చీడే కాంగ్రెస్ పాలన అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఉన్నత పదవులన్నీ సీమాంధ్ర ప్రాంతానికే ఇచ్చారన్నారు. కేంద్ర మంత్రుల పదవుల విషయంలోనూ తెలంగాణవారికి అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నాలుగు ప్రధాన పదవులన్నీ సీమాంధ్ర ప్రాంతానికే ఇచ్చారని అన్నారు. తెలంగాణ ఉద్యమం మొదట ఖమ్మంలోనే మొదలయిందన్నారు. తాము ఎన్నడూ జై ఆంధ్రా ఉద్యమాన్ని తప్పు పట్టలేదన్నారు.

 

also read:హోల్డ్ లోమాజీ మంత్రి తుమ్మల నిర్ణయం

మోడీ, బాబు, ప్రధాని, ఉప ఉపప్రదాని

2013 జూన్ 12 న గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుల్లో ఒకరిని ప్రధాని, మరొకరిని ఉప ప్రధానిని చేద్దామంటూ టీడీపీ శాసన సభ్యులు ఎ.రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. ఈ బాధ్యతను నెత్తిన వేసుకోవాలంటూ ఇటీవలే బీజేపీలో చేరిన శాసన సభ్యులు నాగం జనార్దన్‌రెడ్డిని కోరారు. ఇంతకూ ఈ ప్రతిపాదన ఎలా వచ్చిందంటే.. శాసనసభ ఇన్నర్ లాబీల్లోని బీజేపీ కార్యాలయంలో ఉన్న ఆ పార్టీ శాసన సభ్యులుతో మంగళవారం రేవంత్ కొద్దిసేపు మాట్లాడారు.

తుమ్మల నాగేశ్వరరావువి దిగజారుడు రాజకీయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌పై తెలుగుదేశం శాసన సభ్యులు రేవంత్‌రెడ్డి 2014 సెప్టెంబరు 5, శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌పై తెలుగుదేశం శాసన సభ్యులు రేవంత్‌రెడ్డి 2014 సెప్టెంబరు 5, శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీహార్‌ వలస దొరబాబులు కేసీఆర్‌, కేటీఆర్‌ అని రేవంత్‌ వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో చదివిన కేటీఆర్‌కు తెలంగాణ స్థానికత రాదని ఆయన అన్నారు. తెలుగుదేశంలో పదవులు అనుభవించిన టీఆర్ఎస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావువి దిగజారుడు రాజకీయాలని రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ వల్లే పార్లమెంట్‌లో టి.బిల్లు పాసైందని, సకలజనుల సమ్మెలో కీలక పాత్ర వహించిన మెదక్ జిల్లావాసి దేవీప్రసాద్‌కు టికెట్ ఎందుకివ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube