రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊర‌ట

ప‌రువు న‌ష్టం కేసు కొట్టివేత

0
TMedia (Telugu News) :

రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊర‌ట

 -ప‌రువు న‌ష్టం కేసు కొట్టివేత

టీ మీడియా, అక్టోబర్ 13, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మై హోం రామేశ్వర్ రావు వేసిన పరువు నష్టం దావా కేసును హైకోర్టు కొట్టివేసింది. రేవంత్ రెడ్డిపై రూ.90 కోట్లకు మై హోం రామేశ్వర్ రావు ఈ పరువు నష్టం దావా వేశారు. కాగా, సీఎం కేసీఆర్ అండదండలతో హైటెక్ సిటీ ప్రాంతంలో మై హోం సంస్థ అక్రమాలకు పాల్పడిందని 2014లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణల వల్ల సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం ఏర్పడిందని, అందుకు రూ.90 కోట్లు చెల్లించాలని రామేశ్వర్ రావు రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు కేసు నిరాధారమైనదని భావించి శుక్రవారం కొట్టివేసింది. అయితే ఈ ఆరోపణలు చేసిన సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు.

Also Read : చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube