కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి రేవంత్ రెడ్డి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌

కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి రేవంత్ రెడ్డి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌

1
TMedia (Telugu News) :

కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి రేవంత్ రెడ్డి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌
టీ మీడియా,ఆగస్టు13,హైద‌రాబాద్ : కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేత‌ల తిట్ల‌కు బాధ్య‌త వ‌హిస్తూ రేవంత్ క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ట్వీట్ చేశారు. హోంగార్డు ప్ర‌స్తావ‌న‌, చండూరు స‌భ‌లో వ్యాఖ్య‌ల‌పై కోమ‌టిరెడ్డికి క్ష‌మాప‌ణ చెబుతున్న‌ట్లు రేవంత్ త‌న వీడియోలో పేర్కొన్నారు. చండూరు స‌భ‌లో అద్దంకి ద‌యాక‌ర్ వ్యాఖ్య‌లు స‌రికాద‌ని రేవంత్ అన్నారు.చండూరు స‌భ‌లో త‌న‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించిన అద్దంకి దయాక‌ర్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డడిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. రేవంత్ రెడ్డి బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కోమ‌టిరెడ్డి డిమాండ్ చేశారు.

 

Also Read : 100 ఎకరాల్లో పొంగులేటి కుమార్తె పెళ్లి రిసెప్షన్

 

అప్ప‌టి వ‌ర‌కు మునుగోడుకు దూరంగా ఉంటాన‌ని ఎంపీ తేల్చిచెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామాల మ‌ధ్య రేవంత్ ఓ మెట్టు దిగి కోమ‌టిరెడ్డికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.రేవంత్ రెడ్డి విడుద‌ల చేసిన వీడియో సారాంశం.ఈ మ‌ధ్య ప‌త్రికా స‌మావేశంలో హోంగార్డ్ ప్ర‌స్తావ‌న‌, మునుగోడు బ‌హిరంగ స‌భ‌లో అద్దంకి ద‌యాక‌ర్.. ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని ఉద్దేశించి అస‌భ్య‌క‌ర‌మైన ప‌ద‌జాలం వాడ‌టంతో వారు ఎంతో మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. పీసీసీ అధ్య‌క్షుడిగా సారీ చెప్పాల‌ని కోమ‌టిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి క్ష‌మాప‌ణ చెబుతున్నా. ఇలాంటి భాష ఎవ‌రికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్య‌మంలో అత్యంత క్రియాశీల‌క పాత్ర పోషించి, రాష్ట్ర సాధ‌న‌లో పాత్ర పోషించిన కోమ‌టిరెడ్డిని అవ‌మానించే విధంగా ఎవ‌రూ మాట్లాడిన త‌గ‌దు. త‌దుప‌రి చ‌ర్య‌ల కోసం క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చైర్మ‌న్ చిన్నారెడ్డి సూచ‌న చేయ‌డం జ‌రుగుతంద‌ని రేవంత్ రెడ్డి త‌న వీడియోలో పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube