దావూద్ ఇబ్ర‌హీంపై 25 ల‌క్ష‌ల రివార్డు

దావూద్ ఇబ్ర‌హీంపై 25 ల‌క్ష‌ల రివార్డు

2
TMedia (Telugu News) :

దావూద్ ఇబ్ర‌హీంపై 25 ల‌క్ష‌ల రివార్డు

టీ మీడియా, సెప్టెంబర్ 01, ముంబై: గ్యాంగ్‌స్ట‌ర్ దావూద్ ఇబ్ర‌హీంపై 25 ల‌క్ష‌ల రివార్డును ఎన్ఐఏ ప్ర‌క‌టించింది. అత‌ని స‌మాచారాన్ని ఇస్తే ఆ న‌జ‌రానా ఇవ్వ‌నున్న‌ట్లు ఇవాళ ఎన్ఐఏ తెలిపింది. 1993లో ముంబైలో జ‌రిగిన వ‌రుస పేలుళ్ల కేసులో అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం కీల‌క నిందితుడిగా ఉన్నాడు. ఇక దావూద్ స‌న్నిహితుడు ష‌కీల్ షేక్ అలియాస్ చోటా ష‌కీల్ పై కూడా 20 ల‌క్ష‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించింది.

 

Also Read : 28 వేల ఉగ్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

 

ఎన్ఐఏ. దావూద్‌కు ప‌నిచేసిన హ‌జి అనీస్ అలియాస్ అనీస్ ఇబ్ర‌హీం షేక్‌, జావెద్ ప‌టేల్ అలియాస్ జావెద్ చిక్నా, ఇబ్ర‌హీం ముస్తాక్ అబ్దుల్ ర‌జాక్ మీమ‌న్ అలియాస్ టైగ‌ర్ మీమ‌న్ స‌మాచారం ఇస్తే 15 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లు జాతీయ ద‌ర్య‌ప్తు సంస్థ వెల్ల‌డించింది. నిందితులంద‌రూ 1993 ముంబై సీరియ‌ల్ పేలుళ్ల కేసులో వాంటెడ్ లిస్టులో ఉన్నారు. నిందితుల స‌మాచారం ఇచ్చిన వాళ్ల‌కు న‌జ‌రానా ఇవ్వ‌నున్న‌ట్లు ఎన్ఐఏ తెలిపింది. ఫిబ్ర‌వ‌రిలో డీ కంపెనీపై ద‌ర్యాప్తు సంస్థ కేసును న‌మోదు చేసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube