ఇల్లు కూలిపోయిన కుటుంబాలకు రైస్ బ్యాగులు

ఇల్లు కూలిపోయిన కుటుంబాలకు రైస్ బ్యాగులు

1
TMedia (Telugu News) :

ఇల్లు కూలిపోయిన కుటుంబాలకు రైస్ బ్యాగులు
టీ మీడియా, జూలై 16, జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తుర్కాశి నగర్ గ్రామానికి చెందిన బండరాళ్లు కొట్టుకుంటూ కూలీ జీవనాన్ని కొనసాగిస్తున్న 40 కుటుంబాలు గతవర్షాల పరిస్థితి కారణంగా ఇండ్లు కూలిపోయి ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి, విషయం తెలుసుకున్న హిమ్మత్రావుపేట సర్పంచ్ కృష్ణారావు తనగ్రామ ప్రజలతో కలిసి బియ్యం సేకరించి 25 కేజీల 40 బ్యాగులను సిద్ధం చేసి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ చేతుల మీదుగా నిరుపేద కుటుంబాలకు అందించడం జరిగింది.

 

Also Read : కూలిన సైనిక హెలికాప్టర్‌.. 14 మంది మృతి

 

ఒక గ్రామానికి ఆపదవస్తే మరొక గ్రామం బాసటగా నిలవడం గొప్ప విషయమని పరిస్థితిని ఆలోచించి సహాయాన్ని అందించిన హిమ్మత్ రావుపేట గ్రామ సర్పంచ్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు ను, గ్రామస్తులను ఎమ్మెల్యే రవిశంకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube