అడవి పందుల దాడిలో వరి పంట నష్టం

పంటలను కాపాడుకునేందుకు అన్నదాతల అగచాట్లు

0
TMedia (Telugu News) :

అడవి పందుల దాడిలో వరి పంట నష్టం

– పంటలను కాపాడుకునేందుకు అన్నదాతల అగచాట్లు

టీ మీడియా, డిసెంబర్ 5, మహానంది : మహానంది మండలం మజరా గ్రామ పంచాయతీ గాజులపల్లె గ్రామ పరిధిలోని బసాపురం గ్రామంలోని అదే గ్రామానికి చెందిన రైతు సయ్యద్ హుస్సేన్సా తన అర్ధ ఎకరా పొలంలో వేసుకున్న వరి పంటను సోమవారం రాత్రి అడవి పందులు దాడి చేయడంతో దెబ్బతిన్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆరుగాలం కష్టపడి సాగుచేసుకున్న వరి పంట చేతికందే సమయంలో అడవి పందులు దాడి చేసి నష్ట పరచడం తమకు తీరని నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అడవి పందుల దాడి నుంచి తమ పంట పొలాలను కాపాడుకోవడానికి రైతులు రాత్రి సమయాల్లో కాపు కాస్తున్నారు. అయినప్పటికీ అడవిపందులు అర్ధరాత్రి గుంపులు గుంపులుగా వచ్చి పంటను ధ్వంసం చేసి పోతున్నాయి.పందులను బెదరకొట్టేందుకు పంటల రక్షణకు రైతులు పాత చీరలను కడుతున్నారు.

Also Read : 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు

అయినా అడవి పందులు దాడి చేస్తుండడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడవిపందుల బారి నుంచి పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube