ఆశ్రమానికి బియ్యం పంపిణీ

ఆశ్రమానికి బియ్యం పంపిణీ

1
TMedia (Telugu News) :

ఆశ్రమానికి బియ్యం పంపిణీ

టీ మీడియా,సెప్టెంబర్ 22,గోదావరిఖని : పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి తన కుమారుడి పుట్టినరోజున పది మంది పిల్లలు ముఖాల్లో సంతోషాన్ని చూడాలనుకున్న ఆ తల్లిదండ్రులు ఆదర్శప్రాయులని స్వచ్చంద సంఘాల సలహాదారులు, సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ అన్నారు.

Also Read : కార్పొరేటర్ కర్నాటి సారథ్యం లో

దివంగత అభినవ రెడ్డి జయంతిని పురస్కరించుకొని, సింగరేణి ఆర్జీ-2 పరిధి ఓసీపీ-1 ఈపీ ఆపరేటర్ చంద్రపాల్ సూచన మేరకు, ఆయన స్మారకంగా తల్లిదండ్రులు అనంత రెడ్డి దంపతులు గోదావరిఖని విఠల్ నగర్ లోని అమ్మా పరివార్ ఆశ్రమానికి యాభై కిలోల బియ్యాన్ని అందించగా,వారి తరపున దయానంద్ గాంధీ, స్థానిక కళాకారులు మేజిక్ రాజా ఆశ్రమానికి వెళ్ళి అందజేసారు. చెట్టంత ఎదిగి, చేతికి అంది వచ్చిన కొడుకు మృతి చెందిన పుట్టెడు దుఃఖంలోనూ తన కుమారుడి పుట్టినరోజున పది మందికి పట్టెడన్నం పెట్టాలన్న ఆ తల్లిదండ్రుల ఆలోచన ఆదర్శప్రాయమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube