మానసిక దివ్యాంగులకు అన్నదానం

మానసిక దివ్యాంగులకు అన్నదానం

1
TMedia (Telugu News) :

మానసిక దివ్యాంగులకు అన్నదానం*

టి మీడియా,మర్చి 12,మధిర :స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆవుల సంతోష్ కుమార్ అధ్వర్యంలో మధిర పట్టణం నందు గల వసంతమ్మ సేవా సదనం నందు షేక్ ఇంతియాజ్ అలీ జ్ఞాపకార్థం వారి కుమారుడు, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కలర్స్ పాషా మానసిక దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సదనం నిర్వాహకులు మాట్లాడుతూ స్విమ్మర్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలకు వారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు చల్లా సత్యనారాయణ, సభ్యులు పల్లపోతుల ప్రసాదరావు, ప్రచార కార్యదర్శి లింగంపల్లి అప్పారావు, కార్యవర్గ సభ్యులు వట్టే సైదులు, శీలం శ్రీనివాసరెడ్డి, కంచిపోగు ఆదాం మరియు స్విమ్మర్ సభ్యులు పాల్గొన్నారు.

Also Read : 48జీవో ని రద్దు చేయాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube