జనహిత అన్నదాన కార్యక్రమం

జనహిత అన్నదాన కార్యక్రమం

1
TMedia (Telugu News) :

జనహిత అన్నదాన కార్యక్రమం

టీ మీడియా, అక్టోబర్ 11, బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణం లో మంగళవారం జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం 128 వ సారి బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని ఆకలి తో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని జనహిత అన్నపూర్ణ దాతల సహకారంతో ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.

Also Read : టిఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా భట్టి విక్రమార్క

దాతల కోరిక మేరకు ఈ రోజు 128 వ సారి అన్నదాన కార్యక్రమం కొరకు దాత S. K. గౌస్ జ్ఞాపకార్థం వారి మిత్రులు కుటుంబ సభ్యులు యాచకులకి, నిరుపేదలు, కూలీలు, జరిగిందని ఈ కార్యక్రమం లో సుమారు 180 మందికి అన్నదానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో దాత మిత్రులు కొల్లూరి రాము, జనహిత సేవా సమితి కార్యవర్గ సభ్యులు , నిచ్చకొల గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube