వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాబార్డ్ ఎఫ్.పి.ఓ

వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాబార్డ్ ఎఫ్.పి.ఓ

0
TMedia (Telugu News) :

వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాబార్డ్ ఎఫ్.పి.ఓ

 

టీ మీడియా, ఏప్రిల్ 26, ముత్తారం : పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండల పరిధిలో వెలుగు రేఖ గ్రామీణ అభివృద్ధి సంస్థ మంథని నిర్వహణలో నాబార్డ్ సహకారంతో నడపబడుతున్న ముత్తారం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ముత్తారం యాసంగి వరి ధాన్య కొనుగోలు జరపడం కొరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామ వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని కేటాయించారు. ఈరోజు కిష్టంపేట వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ముత్తారం ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ముత్తారం ఆధ్వర్యంలో నాబార్డ్ డి.డి.యం శ్రీ మనోహర్ రెడ్డి కిష్టంపేట గ్రామ సర్పంచ్ కాసర్ల తిరుపతి రెడ్డి గారితో కలిసి ఘనంగా వారి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ డైరెక్టర్లు మరియు సీఈవో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలపడం జరిగినది. కార్యక్రమంలో వెలుగు రేఖ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సీఈవో రజిత రవి, ముత్తారం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ చైర్మన్ గుజ్జ గోపాలరావు, డైరెక్టర్లు చింతి రెడ్డి బాపురెడ్డి, బండ రాజిరెడ్డి , సీఈవో అమ్ము శ్రీనివాస్, ఏ ఈ ఓ రమేష్ , గూడెం సర్పంచ్ యెల్ల స్వామి కిష్టంపేట గ్రామ రైతులు, హమాలి సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

AlsoRead:డయాబెటిస్ పేషెంట్లు కాఫీ తాగడం మంచిదేనా..?

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube