యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 14: కొణిజర్ల

కొణిజర్ల మండలం లో యసంగికి ప్రత్యామ్నాయ పంటలు మీద గ్రామాల వారీగా గ్రామ సభలు పెట్టి రైతు లకి వేరే పంటలు వేసుకోవాలి అవగాహన సదస్సుల నిర్వహిస్తున్నట్లు ఎం ఏ ఓ బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా మల్లుపల్లి గ్రామం సంక్రాంతి నరసయ్య 14 ఎకరాల వరి పంట బదులుగా ఆయిల్ ఫామ్ పంటను వేశారు. ఈ సంవత్సరం ప్రభుత్వం వరి పంట వద్దనడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పంటలు పై దృష్టి పెడుతున్నారు అని అన్నారు. మండల పరిధిలోని ఎక్కువ మంది రైతులు వరికి బదులుగా ఆయిల్ ఫామ్ వేసేందుకు మొగ్గుచూపుతున్నారని. మండల వ్యాప్తంగా ఎనిమిది వందల ఎకరాలు వరి సాగుకు బదులుగా ఆయిల్ ఫామ్ చేస్తున్నారని చెప్పారు.

అంతేకాకుండా ఆయిల్ ఫామ్ వేసిన తర్వాత ఇతర పంటలు వేసుకోవచ్చని. ఆయిల్ ఫామ్ కు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందని తెలిపారు. నీరు సదుపాయం ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ అఫ్రీన్, గోద్రెజ్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ దుర్గాప్రసాద్, మరియు సంక్రాంతి నరసయ్య, చలపతిరావు రైతులు తదితరులు పాల్గొన్నారు.

MAO Balaji said awareness seminars were being organized in the Kozhikode zone on village wise.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube