డ్రం సీడర్ తో వరి విత్తనం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 27, మహానంది:

మహానంది మండల వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో డ్రం సీడర్ తో వరి విత్తడం ప్రారంభించారు.మహానంది మండలం బొల్లవరం గ్రామంలో మహానంది అనే రైతు పొలంలో డ్రం సీడర్ ద్వారా వరి విత్తనం ఎలా వేసేది రైతులకు వివరించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్ల రైతులకు ఖర్చు తో పాటు దిగుబడి కూడా పెరుగుతుంది అన్నారు. డ్రం సీడర్ తో విత్తడం వల్ల ఎకరాకు ఆరు వేల రూపాయలు ఖర్చు ఆదా అవుతుందన్నారు. వరి విత్తనం కూడా ఎకరాకు పది కిలోలు సరిపోతాయి అన్నారు. తెగుళ్లు చీడ పీడల నివారణఆధునిక వ్యవసాయ పద్ధతులు సాధ్యమవుతుందన్నారు. రైతులు రసాయనిక క్రిమి సంహారక మందులు వాడకం తగ్గియ్యాలి అని సేంద్రియ ఎరువులు వినియోగించాలని రైతులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ మరియు రైతులు శేషయ్య, శీను, ఖాజా హుస్సేన్, నాగేశ్వరరావు, పెద్దబాలన్న, తదితర లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube