16 ఏళ్ల‌కే ఓటు హ‌క్కు.. కొత్త చ‌ట్టం

16 ఏళ్ల‌కే ఓటు హ‌క్కు.. కొత్త చ‌ట్టం

1
TMedia (Telugu News) :

16 ఏళ్ల‌కే ఓటు హ‌క్కు.. కొత్త చ‌ట్టం

టీ మీడియా, నవంబర్ 22, వెల్లింగ్ట‌న్‌ : న్యూజిలాండ్ కొత్త చ‌ట్టాన్ని రూపొందించ‌నున్న‌ది. 16 ఏళ్లు దాటిన వాళ్ల‌కు ఓటు హ‌క్కును క‌ల్పించ‌నున్న‌ది. ఓటరు వ‌య‌సును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాల‌ని న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్ భావిస్తున్నారు. ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఆధారంగా జెసిండా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు దాటిన వాళ్ల‌కే ఓటు హ‌క్కు క‌ల్పించ‌డం అంటే యువ‌త మావ‌న హ‌క్కుల్ని ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని ఆ దేశ సుప్రీంకోర్టు ఓ కేసులో తీర్పునిచ్చింది. అయితే ఓటు హ‌క్కు వ‌య‌సును కుదించేందుకు ప్ర‌ధాని జెసిండా ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Also Read : వర్క్‌షాప్‌లో మంటలు.. 36 మంది సజీవ దహనం

ప్ర‌భుత్వం పాస్ చేసే బిల్లుకు పార్ల‌మెంట్‌లోని 75 శాతం మంది ఎంపీలు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. వాతావ‌ర‌ణ మార్పులు లాంటి అంశాల‌పై యువ‌కులు ఓటు వేయాల్సి ఉంటుంద‌ని న్యూజిలాండ్ కోర్టు పేర్కొన్న‌ది. బ్రెజిల్‌, ఆస్ట్రియా, క్యూబా దేశాలు మాత్రం 18 ఏళ్ల క‌న్నా త‌క్కువ వ‌య‌సున్న వారికి ఓటు వేసే హ‌క్కుల్ని క‌ల్పిస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube