రెండవ రోజు రిలే నిరాహార దీక్ష

రెండవ రోజు రిలే నిరాహార దీక్ష

1
TMedia (Telugu News) :

రెండవ రోజు రిలే నిరాహార దీక్ష

టీ మీడియా, జూలై 22, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి వీఆర్ఏ జేఏసీ కో కన్వీనర్ గోవిందు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ పోరాటంలో మనమంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నామని మన జీవితాలు మారలేదని అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వీఆర్ఏలకు అసెంబ్లీలో ఇచ్చిన హామీలను అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లాలో లోని అన్ని మండలాల వీఆర్ఏలు దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి 9-9- 2020 నాడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను విడుదల చేసి వెంటనే అమలు పరచాలి.

 

Also Read : భారత 15 వ రాష్ట్రపతి గా ము ర్ము ఎన్నిక

అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలి,55 సంవత్సరాలు నిండిన విఆర్ఎల వారసులకు ఉద్యోగాలివ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏవో కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తిరుపతియ్య, జిల్లా చైర్మన్ రమేష్, సురేష్, రాములు, రాజశేఖర్, రమేష్, కృష్ణవేణి, లక్ష్మి, భాగ్యమ్మ, రాధా, శివమ్మ జిల్లాలోని అన్ని మండలాల వీఆర్ఏలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube