ప్రాణాలు కాపాడిన హోంగార్డు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 19 వనపర్తి : గద్వాల జిల్లా బీచుపల్లిలో సాహసోపేత ఘటన చోటు చేసుకుంది.
శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో కృష్ణా నది ఒడ్డుకు చేరుకున్నారు. ఈ క్రమంలో నదిలో స్నానం ఆచరిస్తున్న భక్తుల్లో ఓ చిన్నారి అదుపుతప్పి నీటిలో కొట్టుకు పోయింది. ఈ క్రమంలో వందలాది మంది భక్తులు కేకలు వేయడం ప్రారంభించారు. ఇది గమనించిన వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్లో హోంగార్డు (సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు) కృష్ణ సాగర్ వెంటనే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిలోకి దూకి ఆ చిన్నారులతో పాటు వారి బంధువులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. పాప సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

అయితే ఎంతో సాహసం చేసే పాపను రక్షించిన కృష్ణసాగర్ అక్కడికి వచ్చిన ప్రజలు ప్రశంసించారు. సామాజిక సేవా కార్యక్రమాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజల మన్ననలను పొందిన విషయం అందరికీ తెలిసిన విషయమే తాజాగా తాను చేసిన ఈ సాహసంతో మరోసారి ప్రజల హృదయాలను దోచుకున్నారు.

Devotees reached the banks of the river Krishna
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube