వేర్వేరు ప్రమాదం లో ఏడుగురు మృతి

వేర్వేరు ప్రమాదం లో ఏడుగురు మృతి

1
TMedia (Telugu News) :

వేర్వేరు ప్రమాదం లో ఏడుగురు మృతి

టీ మీడియా,నవంబర్ 3,హైదరాబాద్ : తెలంగాణలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో గురువారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం కన్సాన్‌ పల్లి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Also Read : ఫీడ్ మిక్సింగ్, నెయ్యి తయారీ ప్లాంట్ల నిర్మాణం పనుల్లో వేగం పెంచాలి

మరోవైపు వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలం బాచారం వంతెన సమీపంలో లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు పెద్దేముల్ మండలం మదనంతపూర్‌ గ్రామానికి చెందిన వారిగా తెలిసింది. ఇదే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని వికారాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube