ఏపీలో రోడ్డు ప్రమాదం..

వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ దంపతుల మృతి

1
TMedia (Telugu News) :

ఏపీలో రోడ్డు ప్రమాదం..

-వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ దంపతుల మృతి

టి మీడియా,నవంబర్ 19,కనగానపల్లె : శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లె మండలం పర్వతదేవరపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే..తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ దంపతులు రమ్య, గోపీనాథ్‌, వారి పిల్లలు సాహిత్‌,హాసిని,మరో బంధువుతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తున్నారు. పర్వతదేవరపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి కారు కల్వర్ట్‌ను ఢీకొంది.ఈ ప్రమాదంలో రమ్య, గోపీనాథ్‌ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.

Also Read : మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఘన నివాళులు

వారి బంధువు తారకేశ్వరి, చిన్నారులు సాహిత్‌,హాసిని తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థళికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.చికిత్స పొంతుదూ తారకేశ్వరి(62) మృతి చెందారు. చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube